logo

జయ జయ వాసవీ మాత!

జై..వాసవీ..జైజై వాసవీమాత నామస్మరణతో పెనుగొండ మారుమోగింది. వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా శనివారం కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ తదితర రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్‌ నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు.

Published : 19 May 2024 05:24 IST

కన్యకాపరమేశ్వరి అమ్మవారు 

పెనుగొండ, న్యూస్‌టుడే: జై..వాసవీ..జైజై వాసవీమాత నామస్మరణతో పెనుగొండ మారుమోగింది. వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా శనివారం కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ తదితర రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్‌ నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. వాసవీ కన్యకాపరమేశ్వరిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాసవీ దీక్షాపరులు పెనుగొండ రామాలయం నుంచి 102 కలశాలతో వివిధ వాయిద్యాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరారు. సాయంత్రం వాసవీ యువజన సంఘం ఆధ్వర్యంలో వెండి రథంలో అమ్మవారి గ్రామోత్సవం కనుల పండువగా నిర్వహించారు. వాసవీశాంతిధాంలో అఖిల భారత శ్రీవాసవీ పెనుగొండ ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి జయంతి నిర్వహించారు.  విశేష హోమాలు, సామూహిక లక్ష మల్లెల పూజలు, వెండి రథంపై అమ్మవారి గ్రామోత్సవం, ఊయల సేవ, అష్టాదశ హారతులు, తెప్పోత్సవం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని