logo

మరో వైకాపా ఫ్యానుపై వేటు

వృత్తి ఉద్యోగమైనా... నిబంధనలు ఉల్లంఘించి అత్యుత్సాహంతో ముఖ్యమంత్రి జగన్‌కు ఊడిగం చేసే వారికి తగిన శాస్తి జరుగుతుందనడానికి నిదర్శనమే... ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై వేటు.

Published : 19 Apr 2024 03:11 IST

జిల్లా మూలాలే వెంకట్రామిరెడ్డిపై వేటుకు కారణం

ఇటీవల మైదుకూరు ఆర్టీసీ డిపోలో అధికారులతో మాట్లాడుతున్న వెంకట్రామిరెడ్డి

ఈనాడు, కడప: వృత్తి ఉద్యోగమైనా... నిబంధనలు ఉల్లంఘించి అత్యుత్సాహంతో ముఖ్యమంత్రి జగన్‌కు ఊడిగం చేసే వారికి తగిన శాస్తి జరుగుతుందనడానికి నిదర్శనమే... ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై వేటు. పులివెందులకు చెందిన వెంకట్రామిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ వైకాపాతో అంటకాగుతున్నారు. పంచాయతీరాజ్‌శాఖలో సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన జిల్లాలో తరచూ వైకాపా కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నారు. ఈ మేరకు ఇటీవల వైకాపా తరపున బహిరంగంగా ఎన్నికల ప్రచారం చేపడుతూ కడప, బద్వేలు, ప్రొద్దుటూరు, మైదుకూరు ఆర్టీసీ డిపోల్లో ఉద్యోగులతో సమావేశాలు నిర్వహించారు. వైకాపాకు ఓటెయ్యాలంటూ అభ్యర్థించారు. ఇతర ఉద్యోగ సంఘాలతోనూ సమావేశమై అందరూ వైకాపాకు పని చేయాలంటూ ఒకింత బెదిరింపు ధోరణితో ఒత్తిడి తెచ్చారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లాయి. స్పందించిన ఎన్నికల సంఘం జిల్లా కలెక్టరు విజయరామరాజు ద్వారా నివేదిక తెప్పించుకున్న ఎన్నికల సంఘం వాస్తవాలను గుర్తించి సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈ ఘటన జిల్లా ఉద్యోగుల్లో తీవ్ర చర్చనీయాశమైంది. వైకాపా నేతలు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. నిబంధనల ఉల్లంఘనతో బరితెగింపు ధోరణితో వ్యవహరించే వారికి ఇలాంటి శాస్తే జరుగుతుందంటూ వ్యాఖ్యలు వినిపించాయి. ఈ తరహాలో మరికొందరిపై విచారణ జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని