logo

జగన్‌ను నమ్మాం... నిండా మునిగాం!

‘నేను ఉన్నానన్నావ్‌... నేను విన్నానన్నావ్‌... నిజమే అనుకున్నాం... నీ మాటలు విని మా బాధలు తెలుసుకుంటావని, పరిష్కారం చూపుతావని ఎంతో ఆశతో నిన్ను గెలిపించాం... తీరా చూస్తే నువ్వు ఉన్నావు... కానీ వినే ఓపికే లేకుండా పోయింది.

Published : 19 Apr 2024 03:16 IST

ఏటా వర్షాకాలంలో పట్టణాల్లో మునక సమస్య
అయిదేళ్లు చెవికెక్కించుకోని వైకాపా సర్కారు

‘నేను ఉన్నానన్నావ్‌... నేను విన్నానన్నావ్‌... నిజమే అనుకున్నాం... నీ మాటలు విని మా బాధలు తెలుసుకుంటావని, పరిష్కారం చూపుతావని ఎంతో ఆశతో నిన్ను గెలిపించాం... తీరా చూస్తే నువ్వు ఉన్నావు... కానీ వినే ఓపికే లేకుండా పోయింది. పోనీ ఆ సమస్యను విన్నవిద్దామంటే జనంలోకి వస్తేగా... ఒకవేళ వచ్చినా పరాదాల మాటున వచ్చి వెళ్తావు... మీ ఎమ్మెల్యేలు, మంత్రులకే నీ దర్శనం దక్కకుంటే మాలాంటి వారి పరిస్థితి ఏమిటి. నిన్ను నమ్మినందుకు అయిదేళ్లు నిండా మునిగాం... నగరాలు, పట్టణాలు వానొస్తే వణుకుతున్నాయి. మా దుస్థితి పట్టని నిన్ను నమ్మేదెలా జగన్‌’

  • జిల్లాలో ప్రధాన పట్టణాలన్నీ చిన్న వర్షం వచ్చినా నీట మునుగుతున్నాయి. అయిదేళ్ల జగన్‌ పాలనలో ప్రత్యామ్నాయం చూపక పోవడంతో జిల్లా కేంద్రమైన కడప నగరం మొదలుకుని కమలాపురం, బద్వేలు, మైదుకూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గ కేంద్రాల్లో చాలా ప్రాంతాలు మునకకు గురవుతున్నాయి. 

 ఈనాడు, కడప






 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని