ఆశీర్వదించండి...అండగా ఉంటా: కొల్లు
ఆశీర్వదించండి అందరికీ అండగా ఉంటానని కూటమి మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం ఆయన నగరంలోని 26,27,28 డివిజన్లతోపాటు బందరు మండల పరిధిలోని గుండుపాలెం, ఆర్.గొల్లపాలెం తదితర గ్రామాల్లో పర్యటించారు.
మచిలీపట్నం(గొడుగుపేట),న్యూస్‌టుడే: ఆశీర్వదించండి అందరికీ అండగా ఉంటానని కూటమి మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం ఆయన నగరంలోని 26,27,28 డివిజన్లతోపాటు బందరు మండల పరిధిలోని గుండుపాలెం, ఆర్.గొల్లపాలెం తదితర గ్రామాల్లో పర్యటించారు. అడుగడుగునా ప్రజలు పూలవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బందరు రూపురేఖలు మారుస్తానని మాట ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని మించిన నటుడు పేర్ని నాని అయితే వారిద్దరినీ మించిపోయి నటిస్తున్న వ్యక్తి పేర్ని కిట్టూ అన్ని విమర్శించారు. నియోజకవర్గంలో కూటమి విజయం ఖరారు అయిపోయిందని, అత్యధిక మెజార్టీ ఇచ్చి వైకాపా నాయకులకు దిమ్మతిరిగేలా గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ముస్లింలను నమ్మించి మోసం చేసిన ద్రోహి జగన్ అని, ఆయన మాటలు నమ్మేస్థితిలో ప్రజలు లేరన్నారు. ముస్లింల రిజర్వేషన్‌కోసం, వారి హక్కుల కోసం పోరాడింది చంద్రబాబునాయుడు ఒక్కరే అని తెలిపారు. అన్నివర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సూపర్-6 పథకాలు అందుబాటులోకి తెచ్చామన్నారు. కార్పొరేటర్లు చిత్తజల్లు నాగరాము, అన్నం ఆనంద్, జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజులతోపాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు.. పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
[ 02-06-2024]
నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించాయి. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. -
కౌంటింగ్ రోజు వైకాపా కుట్రలను తిప్పికొట్టాలి: చంద్రబాబు
[ 02-06-2024]
ఏపీలో కూటమి తిరుగులేని విజయం సాధించబోతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. -
తగాదాలు సృష్టించేందుకు వైకాపా ప్రయత్నాలు: సి.ఎం. రమేశ్
[ 02-06-2024]
ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని దాదాపు అన్ని సర్వేలు తేల్చాయని అనకాపల్లి లోక్‌సభ కూటమి అభ్యర్థి (భాజపా) సి.ఎం.రమేశ్ అన్నారు. -
స్వప్నాలు చెదిరినా.. స్వప్నిల్ తీరింతే..!
[ 02-06-2024]
మేం కళ్లు మూసుకున్నాం.. మీరూ కళ్లు మూసుకోండి... జనం ఎలా చనిపోతే ఏంటి? అసలెందుకు ప్రాణాలు పోతున్నాయో? అంటోంది ఘనత వహించిన విజయవాడ నగర పాలక సంస్థ. నిద్రపోతున్నవాళ్లను లేపవచ్చేమోకానీ.. నటించేవాళ్లను ఏమాత్రం మేల్కొల్పలేము! -
ఉన్నారా...? కళ్లు మూసుకున్నారా?
[ 02-06-2024]
నగరంలో కలుషిత నీరు తాగి పదిమంది ప్రాణాలు కోల్పోవడానికి.. వందలాదిమంది ఆసుపత్రులపాలవడానికి కారణాలేమిటో కనుగొనేందుకు వీఎంసీ ఇంతవరకు ఓ విచారణ బృందాన్ని కూడా నియమించలేదు. -
భజే వాయుపుత్రం!
[ 02-06-2024]
శ్రీ ఆంజనేయం.. ప్రసన్నాంజనేయం.. స్మరణతో ఆలయాలు మార్మోగాయి. హనుమజ్జయంతి సందర్భంగా శనివారం ఉమ్మడి కృష్ణా జిల్లాలో అంజనీపుత్రుడికి విశేష పూజలు నిర్వహించి.. ప్రత్యేక అలంకరణతో తీర్చిదిద్దారు. -
మట్టి తవ్వకాలపై ఎన్టీఆర్ కలెక్టర్ కన్నెర్ర
[ 02-06-2024]
‘మీకు ఎంత చెప్పినా చెవికి ఎక్కడం లేదా..? విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు. మీ ప్రాంతంలో మళ్లీ ఇలాంటి సంఘటనలు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి..!’ అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీరావు రెవెన్యూ అధికారులను హెచ్చరించారు. -
ఎన్నికల ఫలితాలు సకాలంలో ప్రకటించాలి
[ 02-06-2024]
ఓట్ల లెక్కింపు పటిష్ఠంగా నిర్వహించి సకాలంలో ఫలితాలు ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బాలాజీ జిల్లాలోని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. -
తవ్వేకొద్దీ అక్రమాలు
[ 02-06-2024]
వ్యవసాయశాఖ పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ) గోల్మాల్ వ్యవహారంలో ప్రైవేటు వ్యక్తితో పాటు వ్యవసాయశాఖ ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు అధికారుల విచారణలో వెలుగుచూస్తోంది. -
భక్తిశ్రద్ధలతో హనుమజ్జయంతి
[ 02-06-2024]
ఇంద్రకీలాద్రిపై భక్తిశ్రద్ధలతో హనుమజ్జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. క్షేత్రపాలక ఆంజనేయస్వామి ఆలయంలో రుత్వికులు పూజలు నిర్వహించారు. -
మా అవస్థలు పట్టవా?
[ 02-06-2024]
కాలువలపై సిమెంటు దిమ్మెలు బాగా దెబ్బతిన్నాయి. ఇనుప చువ్వలు సైతం బయట పడ్డాయి. కొన్నిచోట్ల పైకిలేచి ఉండడంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. -
సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయాలని ప్రార్థ్ధనలు
[ 02-06-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయాలని తెదేపా మహిళా నాయకులు శనివారం దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. -
బాగుచేసేదెప్పుడో?
[ 02-06-2024]
భవానీపురం పరిధిలోని పలు రహదారులు అధ్వానంగా మారాయి. భారీ గోతులు పడటంతో వాహనచోదకులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యధిక సబ్‌స్క్రైబర్లున్న యూట్యూబ్ ఛానల్‌గా మిస్టర్‌బీస్ట్
-
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు.. పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
-
మంత్రి కోమటిరెడ్డి ఆరోపణలు రుజువు చేస్తే.. ముక్కు నేలకు రాస్తా: హరీశ్‌రావు
-
‘మాపై దాడి చేయొద్దు’: రవీనా టాండన్ విజ్ఞప్తి.. వీడియో వైరల్
-
ఏపీలో 3 రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM