logo

‘విశాఖ ఉక్కు పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమిద్దాం’

ఏడాది కాలం పాటు పోరాడి రైతు వ్యతిరేక చట్టాలను తిప్పికొట్టిన స్ఫూర్తితో విశాఖ ఉక్కు పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమిద్దామని వక్తలు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో

Published : 19 Jan 2022 03:31 IST

సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్‌ కొల్లా రాజమోహనరావు,చిత్రంలో వివిధ పార్టీలు, సంఘాల ప్రతినిధులు

లాడ్జిసెంటర్‌, న్యూస్‌టుడే : ఏడాది కాలం పాటు పోరాడి రైతు వ్యతిరేక చట్టాలను తిప్పికొట్టిన స్ఫూర్తితో విశాఖ ఉక్కు పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమిద్దామని వక్తలు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో సీఐటీయూ నాయకులు బి.లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం ఆనాడు విద్యార్థి, యువజనులు పెద్ద ఎత్తున పోరాడారని గుర్తు చేశారు. లాభనష్టాలతో సంబంధం లేకుండా విశాఖ ఉక్కును అమ్మేస్తామని కేంద్ర ప్రభుత్వం పదే పదే ప్రకటించడాన్ని ఖండించాలన్నారు. సంవత్సర కాలంగా విశాఖపట్నంలో, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, దీనిని మరింత ఉద్ధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 26న జిల్లా సదస్సు నిర్వహించాలని, ఉద్యమానికి మద్దతుగా సంతకాలు సేకరించాలని రౌండ్‌టేబుల్‌ సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో ఆనాడు విశాఖ ఉక్కు సాధన కోసం జరిగిన పోరాటంలో పాల్గొన్న డాక్టర్‌ కొల్లా రాజమోహనరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మయ్య, కాంగ్రెస్‌ జిల్లా నాయకులు అడవి ఆంజనేయులు, ఏఐకెఎంఎస్‌ జిల్లా నాయకులు వేల్పూరి నరసింహరావు, కాల్వ శ్రీధర్‌, పి.చెన్నకేశవులు, బీఎస్పీ నాయకులు చిరతనగండ్ల వాసు, ఏఐటీయూసీ నగర కార్యదర్శి ఎ.అరుణ్‌కుమార్‌, అవగాహన సంస్థ ప్రతినిధి కొండ శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని