logo
Updated : 01/12/2021 11:11 IST

ఉత్తుత్తి చోరీలు.. పోలీసుల పరుగులు

అమీర్‌పేట, న్యూస్‌టుడే: మంగళవారం ఉదయం 11 గంటలు.. అమీర్‌పేటలో ఓ బాయ్స్‌ హాస్టల్‌లో ఉంటున్న అరుణ్‌ అనే యువకుడు ఫోన్‌ మాట్లాడుతూ ఎస్సార్‌నగర్‌ ట్రాఫిక్‌ ఠాణా ముందు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో బైక్‌పై వచ్చిన అగంతకుడు చరవాణి లాక్కుపోయాడు. మధ్యాహ్నం 12 గంటలు.. ఎల్బీనగర్‌కు చెందిన మాధవి అనే యువతి అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ దిగి బల్కంపేటకు ఆటోలో బయల్దేరింది. దారి మధ్యలో ఓ వ్యక్తి ఆటో ఎక్కాడు. కొంతదూరం వెళ్లాక మెడపై కత్తి పెట్టి బెదిరించిన అగంతకుడు ఆమె మెడలో బంగారు గొలుసు, చెవి దుద్దులు లాక్కుని ఉడాయించాడు.
పట్టపగలు ఈ ఘటనలు జరిగినట్లు ఫిర్యాదులందుకున్న ఎస్సార్‌నగర్‌ పోలీసులు ఆగమేఘాలపై పరుగులు తీసి నిందితుల కోసం తీవ్రంగా గాలించారు. సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించినా ఫలితం లేకపోవడంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు సిద్ధమయ్యారు. ఇంతలో బాధితులు అసలు విషయం చల్లగా చెప్పారు. తాము ప్రొబెషనరీ ఎస్సైలమని, నగర పోలీసు కమిషనర్‌ ఆదేశాల మేరకు కావాలనే ఫిర్యాదు చేశామన్నారు.దీంతో ఎస్సార్‌నగర్‌ పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

వెబ్‌ జర్నలిస్టు అరెస్ట్‌
నారాయణగూడ: ‘తెరాస ఎమ్మెల్యే రాసలీలలు’ శీర్షికన అశ్లీల వీడియో జోడించి ప్రోమో ప్రసారం చేసిన టీఎస్‌డ్రీమ్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌, జర్నలిస్టు ఆనం చిన వెంకటేశ్వర్లుపై హైదరాబాద్‌ సైబర్‌ ఠాణాలో కేసు నమోదైంది. ఈ ప్రోమో సభ్యసమాజం తలదించుకునేలా ఉందని వెంగళ్రావ్‌నగర్‌లో ఉండే తెరాస నాయకుడు కుమారస్వామి ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్‌ కృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తు మొదలుపెట్టారు. బుధవారం ఆనం చిన వెంకటేశ్వర్లును అరెస్టు చేశారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని