icon icon icon
icon icon icon

Bandi Sanjay: మీరు సీఎం.. సీఎం అన్నందుకే నా పోస్టు పోయింది: బండి సంజయ్‌ ఆసక్తికర వ్యాఖ్య

మంచిర్యాల జిల్లా జన్నారంలో గురువారం నిర్వహించిన భాజపా సభలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. సంజయ్‌ మాట్లాడుతుండగా కార్యకర్తలు సీఎం.. సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ ‘మీరు సీఎం సీఎం అన్నందుకే నా పోస్టు పోయింది’ అని వ్యాఖ్యానించారు. 

Updated : 10 Nov 2023 16:13 IST

జన్నారం: మంచిర్యాల జిల్లా జన్నారంలో గురువారం నిర్వహించిన భాజపా సభలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. సంజయ్‌ మాట్లాడుతుండగా కార్యకర్తలు సీఎం.. సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ ‘మీరు సీఎం సీఎం అన్నందుకే నా పోస్టు పోయింది’ అని వ్యాఖ్యానించారు. 

అంతకుముందు సంజయ్‌ మాట్లాడుతూ భారాస, కాంగ్రెస్‌లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయమన్నారు. అందుకే సుస్థిరంగా ఉండే భాజపాకే పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘భారాస గెలిస్తే కేటీఆర్‌ను సీఎం చేయాలని కేసీఆర్‌ చూస్తున్నారు. అదే జరిగితే హరీశ్‌రావు, సంతోష్‌ వేరు కుంపటి పెట్టి ప్రభుత్వాన్ని కూలుస్తారు. ఒకవేళ కాంగ్రెస్‌ గెలిస్తే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు చూస్తారు. అదే జరిగితే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని కూలుస్తారు’ అని బండి సంజయ్‌ అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img