icon icon icon
icon icon icon

తిరుపతి

చిత్తూరు జిల్లాలో ప్రతిష్టాత్మకమైన స్థానాల్లో తిరుపతి లోకసభ స్థానం ఒకటి

Published : 24 Apr 2024 15:16 IST

లోక్‌సభ నియోజకవర్గ సమాచారం

చిత్తూరు జిల్లాలో ప్రతిష్టాత్మకమైన స్థానాల్లో తిరుపతి లోకసభ స్థానం (Tirupati Lok Sabha constituency) ఒకటి. ఈ లోకసభ స్థానాన్ని ఎస్సీలకు రిజర్వ్‌ చేశారు.

లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: ఏడు అసెంబ్లీ స్థానాలున్నాయి. సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గాలు నెల్లూరు జిల్లాలో ఉండగా చిత్తూరు జిల్లాలో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలు ఉన్నాయి.

ఓటర్లు: 2024 గణాంకాల ప్రకారం మొత్తం 16,99,748 ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 8,29,969, మహిళలు  8,69,621, ట్రాన్స్‌ జెండర్లు 158 మంది ఉన్నారు.

ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో 12సార్లు కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించగా, వైఎస్‌ఆర్‌సీపీ రెండు సార్లు, తెదేపా, భాజపా ఒక్కోసారి విజయం సాధించాయి. 2019 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మీపై వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి బల్లి దుర్గా ప్రసాద్‌రావు విజయం సాధించారు. ఆ తర్వాత 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేసిన గురుమూర్తి విజయం సాధించారు.

ప్రస్తుతం తెదేపా, జనసేన, భాజపా పొత్తులో భాగంగా తిరుపతి లోక్‌సభ స్థానం భాజపాకు వెళ్లింది. దీంతో ఇటీవల పార్టీలో చేరిన వరప్రసాదరావును (Varaprasad Rao Velagapalli) తమ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. మరోవైపు వైకాపా నుంచి సిట్టింగ్‌ ఎంపీ మద్దిల గురుమూర్తి (Maddila Gurumoorthy) మరోసారి పోటీలో నిలిచారు. ఇక కాంగ్రెస్‌ నుంచి చింతా మోహన్ పోటీ చేస్తున్నారు.

  • ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో గెలిచిన నేతలు వీరే!
  • 1952: మాడభూషి అనంతశయనం అయ్యంగార్ (కాంగ్రెస్)
  • 1962: సి. దాస్ (కాంగ్రెస్)
  • 1967: సి. దాస్ (కాంగ్రెస్)
  • 1971: టి. బాలకృష్ణయ్య (కాంగ్రెస్)
  • 1977: టి. బాలకృష్ణయ్య (కాంగ్రెస్)
  • 1980: పసల పెంచలయ్య (కాంగ్రెస్)
  • 1984: చింతా మోహన్ (కాంగ్రెస్)
  • 1989: చింతా మోహన్ (కాంగ్రెస్)
  • 1991: చింతా మోహన్ (కాంగ్రెస్)
  • 1996: నేలవాల సుబ్రహ్మణ్యం (కాంగ్రెస్)
  • 1998: చింతా మోహన్ (తెదేపా)
  • 1999: డా|| నందిపాకు వెంకటస్వామి (భాజపా)
  • 2004: చింతా మోహన్ (కాంగ్రెస్)
  • 2009: చింతా మోహన్ (కాంగ్రెస్)
  • 2014: వర ప్రసాదరావు (వైకాపా)
  • 2019: బల్లి దుర్గా ప్రసాద్‌ రావు (వైకాపా)
  • 2021: (ఉప ఎన్నిక) మద్దిలి గురుమూర్తి (వైకాపా)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img