icon icon icon
icon icon icon

రాజమహేంద్రవరం

రాజమహేంద్రవరం 1952లో ఏర్పాటైంది. మొదటి నుంచి ఇది జనరల్‌ కేటగిరిలో ఉంది.

Published : 12 May 2024 19:18 IST

లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం పట్టణం, రాజమహేంద్రవరం రూరల్‌, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం అసెంబ్లీ స్థానాలు దీని కిందికి వస్తాయి.

ఓటర్లు: 2024 ఓటర్ల జాబితా ప్రకారం నియోజకవర్గంలో మొత్తం 16.06 లక్షల మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 7.85 లక్షలు, మహిళలు 8.20 లక్షలు, ట్రాన్స్‌జెండర్లు 105 మంది ఉన్నారు.

ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ 10 సార్లు, తెదేపా 3, భాజపా 2, వైకాపా ఒకసారి విజయం సాధించాయి.  2014 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి మాగంటి మురళీ మోహన్‌ విజయం సాధించారు. ఇక 2019లో తెదేపా అభ్యర్థి మాగంటి రూపపై వైకాపా అభ్యర్థి మార్గాని భరత్‌ దాదాపు లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

ఈసారి ప్రధాన పార్టీల నుంచి పోటీలో ఉన్నది వీళ్లే!

ప్రస్తుతం తెదేపా, జనసేన, భాజపా పొత్తులో భాగంగా ఈ స్థానం భాజపాకు వెళ్లింది. ఆ పార్టీ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి పోటీ చేస్తుండగా, వైకాపా నుంచి గూడూరి శ్రీనివాసులు బరిలో నిలిచారు. ఎన్టీఆర్‌ కుమార్తెగా రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన పురందేశ్వరి కాంగ్రెస్‌, భాజపాలో విస్తృత సేవలందించారు. గతంలో బాపట్ల, విశాఖ ఎంపీగా విజయం సాధించిన ఆమె.. కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. ప్రస్తుతం భాజపా రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇక గత ఎన్నికల్లో వైకాపా నుంచి ఎంపీగా పోటీ చేసిన మార్గాని భరత్‌కు ఈసారి సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండటంతో నగరానికి చెందిన ప్రముఖ వైద్యుడు (పల్మనాలజిస్ట్‌) డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ను ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. గతేడాది వైకాపా రాజమహేంద్రవరం సిటీ కో-ఆర్డినేటర్‌గా పనిచేసిన ఆయన ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తుండటం గమనార్హం. కాంగ్రెస్‌ నుంచి గిడుగు రుద్రరాజు బరిలో నిలిచారు.

  • ఇప్పటివరకూ గెలుపొందిన అభ్యర్థులు వీళ్లే!
  • 1952 - నల్ల రెడ్డి నాయుడు (సోషలిస్టు పార్టీ)
  • 1952 - కానేటి. మోహన్‌రావు (సీపీఐ)
  • 1957 - దాట్ల సత్యనారాయణ రాజు (కాంగ్రెస్‌)
  • 1962 - దాట్ల సత్యనారాయణ రాజు (కాంగ్రెస్‌)
  • 1967 - దాట్ల సత్యనారాయణ రాజు (కాంగ్రెస్‌)
  • 1971 - ఎస్‌.బి.పి.పట్టాభిరామారావు (కాంగ్రెస్‌)
  • 1977 - ఎస్‌.బి.పి.పట్టాభిరామారావు (కాంగ్రెస్‌)
  • 1980 - ఎస్‌.బి.పి.పట్టాభిరామారావు (కాంగ్రెస్‌)
  • 1984 - చుండ్రు. శ్రీహరి రావు (తెదేపా)
  • 1989 - జమున (కాంగ్రెస్‌)
  • 1991 - కేవీఆర్‌ చౌదరి (తెదేపా)
  • 1996 - చిత్తూరి. రవీంద్ర (కాంగ్రెస్‌)
  • 1998 - గిరజాల. వెంకట స్వామినాయుడు (భాజపా)
  • 1999 - ఎస్‌.బి.పి.బి.కె. సత్యనారాయణరావు (భాజపా)
  • 2004 - ఉండవల్లి. అరుణ్‌ కుమార్‌ (కాంగ్రెస్‌)
  • 2009 - ఉండవల్లి. అరుణ్‌ కుమార్‌ (కాంగ్రెస్‌)
  • 2014 - మురళీ మోహన్‌ (తెదేపా)
  • 2019 - మార్గాని భరత్‌ (వైకాపా)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img