icon icon icon
icon icon icon

Ts Elections: ఎన్నికల ఫలితాలు సర్వేలకు అందని విధంగా ఉంటాయి: ఈటల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సర్వేలకు అందని విధంగా ఉంటాయని భాజపా నేత ఈటల రాజేందర్‌ అన్నారు. 

Published : 30 Nov 2023 20:52 IST

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజల్లో సీఎం కేసీఆర్‌పై వ్యతిరేకత ఉందని, ఆయన నియంతలా రాష్ట్రాన్ని దోచుకున్నారని భాజపా నేత ఈటల రాజేందర్‌ (Eatala Rajender) ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో (Telangan Assembly Elections 2023) రాష్ట్ర ప్రజలు ఆయన్ను ఓడించాలనే కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. హుజురాబాద్‌ ప్రజలు తనను ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు తెలిపారు. గజ్వేల్‌లో తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి భాజపా కార్యకర్తకు ఈటల కృతజ్ఞతలు చెప్పారు. ఎన్నికల ఫలితాలు సర్వే సంస్థలకు అందని విధంగా ఉంటాయని అన్నారు. రాష్ట్రంలో భాజపా విజయం ఖాయమని ఈటల ధీమా వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img