icon icon icon
icon icon icon

Kavitha: కాంగ్రెస్‌ మొసలి కన్నీరును నమ్మితే ప్రజలకు కన్నీళ్లే: ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్‌ మొసలి కన్నీరును నమ్మితే ప్రజలకు కన్నీళ్లే మిగులుతాయని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ కాంగ్రెస్‌ నేతల సమావేశాలు మాత్రమే జరిగాయని ఎద్దేవా చేశారు.

Updated : 28 Nov 2023 13:14 IST

నిజామాబాద్‌: కాంగ్రెస్‌ మొసలి కన్నీరును నమ్మితే ప్రజలకు కన్నీళ్లే మిగులుతాయని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ కాంగ్రెస్‌ నేతల సమావేశాలు మాత్రమే జరిగాయని ఎద్దేవా చేశారు. భారాస ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం, పరిశ్రమలు, ఇళ్లకు 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నామని చెప్పారు. ఈ పదేళ్లలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశామని.. మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. నిజామాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. 

‘‘భారాస ప్రభుత్వం వచ్చాక 2.30లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం. వాటిలో ఇప్పటికే 1.30లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. ప్రైవేటు రంగంలో 30లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించాం. రాష్ట్రంలో కొత్తగా 10లక్షల ఐటీ ఉద్యోగాలు సృష్టించాం. గల్ఫ్‌ కార్మికులను ఆదుకునేందుకు కొత్త పాలసీ ప్రకటిస్తాం. రేషన్‌కార్డుల సమస్యలు పరిష్కరించి అందరికీ రూ.5లక్షల బీమా కల్పిస్తాం’’ అని కవిత అన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img