icon icon icon
icon icon icon

Chada Venkat Reddy: కేసీఆర్ వైఫల్యాలే.. కాంగ్రెస్ అనుకూల పవనాలకు కారణం: చాడ వెంకట్‌ రెడ్డి

తెలంగాణలో భారాస ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి (Chada Venkat Reddy) అన్నారు.

Updated : 13 Nov 2023 14:17 IST

హైదరాబాద్: తెలంగాణలో భారాస ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి (Chada Venkat Reddy) అన్నారు. ప్రజల్లో కాంగ్రెస్‌కు ఆదరణ పెరుగుతోందనే.. భాజపా, భారాస కలిసి అనేక ఆరోపణలు చేస్తున్నాయని చెప్పారు. ‘‘గజ్వేల్, కామారెడ్డి రెండు స్థానాల్లో సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారు. ఈ రెండు స్థానాల్లోనే అత్యధిక నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నామినేషన్లు కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలనకు అద్దం పడుతున్నాయి.  

అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మీద జరిగిన దాడి ఘటనపై విచారణ జరిపించాలి. కాంగ్రెస్‌పై నెపం నెట్టడం సరైంది కాదు. కేసీఆర్ వైఫల్యాలే.. కాంగ్రెస్ అనుకూల పవనాలకు కారణం. కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం సీపీఐ పని చేస్తుంది’’ అని చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img