Telangana Elections: ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌

తెలంగాణలో ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. (Telangana Elections 2023) పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. నటులు ఎన్టీఆర్‌(NTR), అల్లు అర్జున్‌(Allu Arjun), సుమంత్, సంగీత దర్శకుడు కీరవాణి తదితరులు క్యూలైన్‌లో నిలుచుని ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Updated : 30 Nov 2023 07:55 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. (Telangana Elections 2023) పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. నటులు ఎన్టీఆర్‌(NTR), అల్లు అర్జున్‌(Allu Arjun), సుమంత్, సంగీత దర్శకుడు కీరవాణి తదితరులు క్యూలైన్‌లో నిలుచుని ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఎన్టీఆర్‌ తన కుటుంబంతో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. తన సతీమణి లక్ష్మీ ప్రణతి, తల్లి షాలినితో కలిసి ఎన్టీఆర్‌ వచ్చారు. అల్లు అర్జున్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌ క్లబ్‌లో సుమంత్‌ ఓటు వేశారు.

మరోవైపు మాదాపూర్‌లోని వెంకటేశ్వర ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాల పోలింగ్‌ బూత్‌లో హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్‌ రోస్‌ ఓటు వేశారు. తన సతీమణితో కలిసి పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు. నగర ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని రొనాల్డ్‌ రోస్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని