icon icon icon
icon icon icon

TS Elections: మంత్రి మల్లారెడ్డి అఫిడవిట్‌పై ఫిర్యాదు: మేడ్చల్‌ ఆర్వో

మేడ్చల్‌లో బరిలో ఉన్న మంత్రి మల్లారెడ్డి అఫిడవిట్‌పై ఫిర్యాదు వచ్చినట్లు రిటర్నింగ్‌ అధికారి పేర్కొన్నారు.

Published : 13 Nov 2023 23:19 IST

హైదరాబాద్‌: మేడ్చల్‌లో బరిలో ఉన్న మంత్రి మల్లారెడ్డి అఫిడవిట్‌పై ఫిర్యాదు వచ్చినట్లు రిటర్నింగ్‌ అధికారి పేర్కొన్నారు. మంత్రి మల్లారెడ్డిపై రాంపల్లి దాయార నివాసి అంజిరెడ్డి ఫిర్యాదు చేసినట్లు ఆర్వో తెలిపారు. మల్లారెడ్డి విద్యార్హత, వయసు అంశాలపై ఫిర్యాదు వచ్చినట్లు పేర్కొన్నారు. 2014, 2018 అఫిడవిట్లను అంజిరెడ్డి ఎత్తిచూపారన్నారు. పాతవి, కొత్త అఫిడవిడ్లకు తేడాలున్నాయని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అయితే అప్పటికే మల్లారెడ్డి అఫిడవిట్‌కు ఆమోదం పొందిందని, అంజిరెడ్డి అభ్యంతరాన్ని అఫిడవిట్‌ను వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని మేడ్చల్‌ ఆర్వో తెలిపారు. 

గజ్వేల్‌ బరిలో 114 మంది..

ఇక సీఎం కేసీఆర్‌ బరిలో ఉన్న గజ్వేల్‌ అసెంబ్లీ స్థానానికి సంబంధించి 114 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం లభించింది. గజ్వేల్‌లో మొత్తం 127 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, 13 నామినేషన్లను తిరస్కరించినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. 

8 మంది బీఎస్పీ అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ..

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీఎస్పీ తరఫున నామినేషన్లు దాఖలు కాగా, పరిశీలన అనంతరం 8 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వివిధ కారణాల వల్ల 8 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో 111 నియోజకవర్గాల్లో బీఎస్పీ బరిలో నిలిచింది. స్టేషన్ ఘన్‌పూర్‌, పాలకుర్తి, భువనగిరి, మిర్యాలగూడ, ఆలేరు, మధిర, బహదూర్‌పురా, గోషామహల్‌ నియోజకవర్గాల్లో బీఎస్పీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img