icon icon icon
icon icon icon

Revanth Reddy: రేవంత్‌ ప్రమాణస్వీకారం.. నగరానికి చేరుకున్న సోనియా, రాహుల్‌

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో నగరానికి ముఖ్యనేతలు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు.

Updated : 07 Dec 2023 11:42 IST

హైదరాబాద్‌: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1.04 గంటలకు నగరంలోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌ నివాసం వద్ద కాన్వాయ్‌ను అధికారులు సిద్ధం చేశారు. ఆయన ఇంటివైపు వెళ్లే మార్గాల్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్‌ అగ్రనేతలతో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ముఖ్యనేతలు హాజరుకానున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీకి స్వయంగా రేవంత్‌ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం వారు నగరంలోని తాజ్‌కృష్ణ హోటల్‌కు చేరుకున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img