icon icon icon
icon icon icon

congress: గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్‌ నేతలు.. సోమవారం సీఎల్పీ సమావేశం

కాంగ్రెస్‌ నేతల బృందం గవర్నర్‌ తమిళిసైని కలిసింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ లేఖ అందజేశారు.

Updated : 03 Dec 2023 22:28 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేతల బృందం గవర్నర్‌ తమిళిసైని కలిసింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ లేఖ అందజేశారు. సోమవారం శాసనసభాపక్ష సమావేశం అనంతరం సీఎల్పీ నేత పేరును నివేదిస్తామని నేతలు చెప్పినట్టు సమాచారం. గవర్నర్‌ను కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డితో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలు డీకే శివకుమార్‌, మాణిక్‌రావ్‌ ఠాక్రే, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మల్లు రవి తదితరులు ఉన్నారు. సోమవారం సాయంత్రం ప్రమాణస్వీకారోత్సవానికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు అందినట్టు తెలిసింది.

గవర్నర్‌ను కలిసిన అనంతరం డీకే శివకుమార్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘గవర్న్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పాం. మాకు 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పాం. సోమవారం ఉదయం 9.30గంటలకు సీఎల్పీ సమావేశం ఉంటుంది. కాంగ్రెస్‌లో ఒక విధానం ఉంటుంది... ఆ ప్రకారమే ప్రక్రియ ఉంటుంది’’ అని డీకే శివకుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img