నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి: గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్‌ బృందం

తెలంగాణ కాంగ్రెస్‌ (Congress) నేతల బృందం గవర్నర్‌ తమిళిసైను కలిసింది. నేతలు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, మల్లు రవి తదితరులతో కూడి బృందం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సమావేశమైంది.

Published : 06 Dec 2023 13:39 IST

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ (Congress) నేతల బృందం గవర్నర్‌ తమిళిసైను కలిసింది. నేతలు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, మల్లు రవి తదితరులతో కూడి బృందం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సమావేశమైంది. సీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డి(Revanth Reddy)ని ఎన్నుకున్నట్లు ఉన్న లేఖను అందజేశారు. దీంతో పాటు 64 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను ఇచ్చారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌ను నేతలు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని