icon icon icon
icon icon icon

Telangana Elections: హైదరాబాద్‌ సహా జిల్లాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రారంభం

తెలంగాణ వ్యాప్తంగా గురువారం జరగనున్న ఎన్నికల పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు. డీఆర్‌సీ కేంద్రాలకు పోలింగ్‌ సిబ్బంది చేరుకుంటున్నారు.

Updated : 29 Nov 2023 13:42 IST

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా గురువారం జరగనున్న ఎన్నికల పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది.  డీఆర్‌సీ కేంద్రాలకు చేరుకున్న పోలింగ్‌ సిబ్బందిఇక ఈవీఎంలు, ఇతర సామగ్రిని అధికారులు అందజేస్తున్నారు. పోలింగ్‌ సిబ్బంది బుధవారం సాయంత్రం లోపు కేంద్రాలకు చేరుకోనున్నారు. యూసుఫ్‌గూడ, గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన డీఆర్‌సీ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్‌ రోస్‌ పరిశీలించారు. అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. 

రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో 1.85లక్షల మంది విద్యార్థులు పాల్గొననున్నారు. 27,094 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలింగ్‌ ప్రక్రియ పరిశీలనకు 22వేల మంది అబ్జర్వర్లు, స్క్వాడ్లను నియమించారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img