icon icon icon
icon icon icon

Eatala Rajender: కేసీఆర్‌.. పేదలను కొట్టి పెద్దలకు ఇస్తున్నారు: ఈటల రాజేందర్‌

దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని కేసీఆర్‌ మోసం చేశారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ (Eatala Rajender) అన్నారు.

Published : 28 Nov 2023 14:32 IST

సిద్దిపేట: దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి కేసీఆర్‌ మోసం చేశారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ (Eatala Rajender) అన్నారు. గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఎస్సీ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూమి ఇవ్వకపోగా పేదలకు ఉన్న భూములను లాక్కున్నారని ఆరోపించారు. రూ.10 లక్షల పరిహారం ఇచ్చి.. రూ. కోట్లకు అమ్ముకున్నారని విమర్శించారు.

‘‘కొండపాక కలెక్టర్ కార్యాలయం నిమిత్తం 25 ఎకరాల భూమి అవసరమైతే 350 ఎకరాల భూమిని తీసుకొని.. మిగతా భూమిని ప్లాట్లుగా చేసి విక్రయించారు. కేసీఆర్‌ పేదలను కొట్టి పెద్దలకు ఇస్తున్నారు. పేదవాళ్లకు ₹కోట్ల విలువ చేసే భూములు ఉండకూడదనే కేసీఆర్ అలా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేసిన అభివృద్ధిని కూడా కేసీఆర్‌ తన ఖాతాలో వేసుకుంటున్నారు. భారాస కండువా వేసుకోకపోతే.. వారిని తెలంగాణ గడ్డమీద బతకనివ్వం, కేసులు పెడతాం అని బెదిరించే పరిస్థితి ఏర్పడింది’’ అని ఈటల వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img