icon icon icon
icon icon icon

Tummala Nageswara Rao: తుమ్మల నివాసంలో ఈసీ అధికారులు సోదాలు

మాజీ మంత్రి,  ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) నివాసంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) అధికారులు సోదాలు చేపట్టారు.

Published : 08 Nov 2023 13:55 IST

ఖమ్మం: మాజీ మంత్రి,  ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) నివాసంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) అధికారులు సోదాలు చేపట్టారు.  శ్రీ సిటీలో ఉన్న తుమ్మల నివాసంలో ఈసీకి సంబంధించిన ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో తుమ్మల ఇంట్లో లేరు. సీ-విజిల్‌ యాప్‌లో ఫిర్యాదు మేరకు తనిఖీలు చేసినట్లు అధికారులు తెలిపారు. తుమ్మల సతీమణి భ్రమరాంబ సోదాలకు సహకరించినట్లు అధికారులు చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img