icon icon icon
icon icon icon

Deeksha Diwas: తెలంగాణ భవన్‌లో దీక్షా దివస్‌పై ఎన్నికల స్క్వాడ్‌ అభ్యంతరం

తెలంగాణ భవన్‌లో భారాస చేపట్టిన దీక్షా దివస్‌పై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) స్క్వాడ్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రచారం గడువు ముగిసినందున ఈసీ అభ్యంతరం తెలిపింది.

Published : 29 Nov 2023 12:45 IST

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో భారాస చేపట్టిన దీక్షా దివస్‌పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్క్వాడ్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. గడువు ముగిసినందున పార్టీ కార్యాలయాల్లో ప్రచారం నిర్వహించొద్దని అధికారులు సూచించారు. అయితే దీక్షా దివస్‌ ఎన్నికల కార్యక్రమం కాదని భారాస నేతలు చెప్పారు. తెలంగాణ భవన్‌ బయట, ఆవరణలో కార్యక్రమాలు చేయొద్దని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. రక్తదాన శిబిరం నిర్వహిస్తామని భారాస నేతలు కోరగా.. ఎన్నికల అధికారులు అంగీకరించారు. అనంతరం భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ సహా ఇతర నేతలు తెలంగాణ భవన్‌లో రక్తదానం చేశారు. 

రక్తదానం చేస్తున్న కేటీఆర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img