icon icon icon
icon icon icon

తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పలువురి నియామకం

తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కేఈ ప్రభాకర్‌, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ఆర్‌.జితేంద్రగౌడ్‌, వీఎస్‌ అమీర్‌బాబు, ఎం.వెంకటేశ్వరరావు, చీరాల గోవర్ధన్‌రెడ్డిలను నియమించినట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు బుధవారం వెల్లడించారు.

Published : 02 May 2024 06:22 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కేఈ ప్రభాకర్‌, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ఆర్‌.జితేంద్రగౌడ్‌, వీఎస్‌ అమీర్‌బాబు, ఎం.వెంకటేశ్వరరావు, చీరాల గోవర్ధన్‌రెడ్డిలను నియమించినట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు బుధవారం వెల్లడించారు. వీరితోపాటు పదిమందిని పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులుగా, 12మందిని కార్యదర్శులుగా నియమించారు. కార్యనిర్వాహక కార్యదర్శులుగా.. భూమా బ్రహ్మానందరెడ్డి, పూల నాగరాజు, జి.లక్ష్మిరెడ్డి, మెట్టుకూరు ధనుంజయరెడ్డి, కత్తెర సురేష్‌, తమ్మినేని నటేష్‌చౌదరి, మల్లెల రాజేష్‌నాయుడు, కాకరవాడ చిన్న వెంకటస్వామి, కర్రి సాయికృష్ణ, చమరపాకు దివాకర్‌రెడ్డిలను నియమించారు. కార్యదర్శులుగా.. నంద్యాల కొండారెడ్డి, వాసంశెట్టి సత్య, సాకె గంపన్న, ఎస్‌ఎండీ ముస్తక్‌ హుస్సేన్‌, కృష్ణ చైతన్యయాదవ్‌, రావెల్ల వీరేంద్ర చౌదరి, తూగుట్ల మధుసూధన్‌రెడ్డి, యలగల నూకాలమ్మ, కె.హరిచంద్రరెడ్డి, ఎల్‌సీవీ రమణరెడ్డి, జి.సూర్యనారాయణ, కంటె కేశవరావులను ఎంపిక చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్టు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

లోక్‌సభ నియోజకవర్గాలైన అనంతపురానికి కె.ఈరన్న.. చిత్తూరుకు సీఆర్‌ రాజన్‌, శ్రీరామినేని చంద్రప్రకాశ్‌.. అరకు సీటుకు టి.హర్షవర్ధన్‌ప్రసాద్‌లను ఎన్నికల సమన్వయకర్తలుగా నియమించింది. శాసనసభ స్థానాలైన పాతపట్నానికి కె.రాజబాబు, గన్నవరానికి ఎం.వెంకటేశ్వరరావు, తిరువూరుకు కె.విజయబాబు, జగ్గయ్యపేటకు యంవీఆర్‌ చౌదరిలను ఎంపిక చేసింది. మైనారిటీ సెల్‌ కార్యదర్శిగా సయ్యద్‌ మెహతాజ్‌బేగం, తెలుగు యువత ప్రధానకార్యదర్శిగా బి.కుబేరనాథ్‌లను నియమించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img