ప్రచార భాగస్వాములు
‘ప్రతి మగవాడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుంది..’ అంటారు. ఈ నానుడిని నిజం చేస్తూ ఎన్నికల సమరాంగణంలో మేము సైతం అంటూ అతివలు భాగస్వాములవుతున్నారు.
పార్టీ శ్రేణులతో కలిసి క్షేత్ర స్థాయి పర్యటనలు
న్యూస్‌టుడే, మేడిపల్లి, జగిత్యాల: ‘ప్రతి మగవాడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుంది..’ అంటారు. ఈ నానుడిని నిజం చేస్తూ ఎన్నికల సమరాంగణంలో మేము సైతం అంటూ అతివలు భాగస్వాములవుతున్నారు. సభలు, సమావేశాల్లో పాల్గొనడమే కాకుండా, ఇంటింటి ప్రచారంలో ముందుంటున్నారు. తోటి మహిళలతో కలిసి బొట్టు పెట్టి మరీ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. భర్త విజయం కోసం అలుపెరగకుండా నిత్యం ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ తరహా ప్రచారం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. పార్టీ తరఫున నిర్వహించే వేదికలపైనా అభ్యర్థుల సతీమణులు మాట్లాడుతూ ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేస్తున్నారు.
మా ఆయనకే ఓటేయండి
- కరీంనగర్లో మంత్రి, భారాస అభ్యర్థి గంగుల కమలాకర్ సతీమణి రజిత, కాంగ్రెస్ అభ్యర్థి పురమల్ల శ్రీనివాస్ భార్య, జడ్పీటీసీ సభ్యురాలు లలిత ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
- కోరుట్ల భారాస అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ భార్య దీప్తి, సోదరి సమత ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు తరపున ఆయన భార్య రజని, భాజపా అభ్యర్థి అర్వింద్ సతీమణి ప్రియాంకలు ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
- పెద్దపల్లిలో భారాస అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి భార్య పుష్పలత, రామగుండంలో కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ సతీమణి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
- జగిత్యాలలో భారాస అభ్యర్థి సంజయ్‌కుమార్ గెలుపు కోసం సతీమణి రాధిక శ్రమిస్తున్నారు. చొప్పదండిలో సుంకె రవిశంకర్ భార్య దీవెన సమావేశాలు, ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారు.
జగిత్యాల భారాస అభ్యర్థి డా.సంజయ్ సతీమణి రాధిక
కొంగు పట్టి అడుగుతున్నా..
‘ఈ ప్రాంత ఆడబిడ్డనై మీ అందరి ముందు కొంగు పట్టి అడుగుతున్నా.. ఓటు భిక్ష వేయండి’ అంటూ హుజూరాబాద్ భారాస అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి భార్య శాలినిరెడ్డి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి సభలోనూ ఆమె ఇలాగే అడిగారు. ఎన్నికల కంటే ముందే వినాయక నవరాత్రి ఉత్సవాలు, దసరా, బతుకమ్మ వేడుకల్లోనూ శాలినిరెడ్డి అతివలతో కలిసి పాల్గొన్నారు. వీరి కూతురు శ్రీనికరెడ్డి కూడా ముఖ్యమంత్రి సభ సహా పలు కార్యక్రమాల్లో మాట్లాడుతూ ఓట్లు అడిగింది.
ప్రజాప్రతినిధిగా పర్యవేక్షణ
మంథని భారాస అభ్యర్థి పుట్ట మధూకర్ భార్య, పురపాలక ఛైర్పర్సన్ శైలజ ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. పట్టణంలో విస్తృతంగా పర్యటిస్తూ భారాస ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు భర్త గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధిపై ప్రచారం చేస్తున్నారు. స్థానిక మహిళలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. వివిధ కార్యక్రమాల నిర్వహణ, సమీక్షలతో పాటు రోజువారీ ప్రచారంపై ఆమె తెలుసుకుంటున్నారు. అతిరథుల సభల సమయంలోనూ సూచనలు చేస్తున్నారు.
అక్కడ రాజేందర్.. ఇక్కడ జమున
భాజపా నేత ఈటల రాజేందర్ ఈసారి రెండు చోట్లా పోటీ చేస్తుండగా గజ్వేల్‌లో ప్రచారానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. దీంతో హుజూరాబాద్ స్థానంలో ప్రచార బాధ్యతలను ఆయన సతీమణి జమున మోయాల్సి వస్తోంది. ప్రతి ఎన్నికతో పాటు గతంలో పార్టీ మారిన సందర్భంలోనూ ఆయన తరఫున మాట్లాడిన జమున హుజూరాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ మ్యానిఫెస్టోపై ప్రచారం చేస్తున్నారు.
వికాస్ వెన్నంటే దీప
చెన్నమనేని వికాస్‌రావు సతీమణి దీప
వేములవాడ భాజపా అభ్యర్థి చెన్నమనేని వికాస్ భార్య డాక్టర్ దీప భర్త వెన్నంటే ఉంటూ ఎన్నికల ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. సామాజిక సేవలో పాల్గొన్నప్పటి నుంచే ఇద్దరూ కలిసే వివిధ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఎన్నికల ప్రకటన అనంతరం ఆమె వేములవాడ నియోజకవర్గంలోని భాజపా నేతలు, కార్యకర్తలు తదితర వివరాలను కంప్యూటరీకరించి నేరుగా కార్యక్రమాలను సమీక్షిస్తున్నారు. రోజువారీ కార్యక్రమాల నిర్వహణలపై బాధ్యులతో మాట్లాడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మతోన్మాద, అవినీతి పార్టీలను ఓడించాలి
మతోన్మాద, అవినీతి ప్రభుత్వాలను ఓడించాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి, జాగో తెలంగాణ ఛైర్పర్సన్ జస్టిస్ చంద్రకుమార్ పిలుపునిచ్చారు. -
ప్రలోభాల అడ్డుకట్టకు మరింత నిఘా
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమీపించడంతో నిఘాను మరింత విస్తృతం చేశామని, గురువారం పోలింగ్ ముగిసేంత వరకు రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ వెల్లడించారు. -
కరీంనగర్లో డబ్బు పంపిణీపై భాజపా నేతల ఆందోళన
కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి పురపాలికలో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో భారాస నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ భాజపా నాయకులు ఆందోళన చేపట్టారు. -
మరో 11 మంది బందీల విడుదల
ఇజ్రాయెల్, హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా నాలుగో విడత బందీల విడుదల మంగళవారం ఉదయానికి పూర్తయింది. హమాస్ 11 మందిని, ఇజ్రాయెల్ 33 మందిని విడుదల చేశాయి. -
తక్కువ ఓట్లు వచ్చేచోట.. ఎక్కువ నోట్లు
అసెంబ్లీ ఎన్నికల సమరంలో హోరాహోరీగా తలపడ్డ ప్రధాన పార్టీలు తాము చేసిన ప్రచారాన్ని ఓట్ల రూపంలో మలచుకోవడంపై దృష్టి సారించాయి. సిద్ధం చేసిపెట్టుకున్న సంచుల్లోంచి నోట్ల కట్టలు తెగిపడుతున్నాయ్.. మద్యం ఏరులై పారుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రలోభాలపర్వం పతాకస్థాయికి చేరుకుంది. -
అభివృద్ధిని చూడండి... ఆశీర్వదించండి
‘మేం గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. సగం కాలిన కడుపులు, ఎమర్జెన్సీ.. కర్ఫ్యూలు.. ఎన్కౌంటర్లు.. రక్తపాతాలు.. కరెంటు కోతల వంటి వెతలతో నిత్యం ప్రజలు కన్నీళ్లు కార్చే ఆ రాజ్యాన్ని మనం మళ్లీ తెచ్చుకోవద్దు. -
డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్రం భద్రం
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతి, కుటుంబ పార్టీలు ఓడిపోయి ప్రజలు, ప్రజాస్వామ్యం గెలవాలని భాజపా కోరుకుంటోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవహేళన చేసే పార్టీకి, సామాజిక తెలంగాణకు అడ్డుగా ఉన్న మరో పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. -
ఏ కష్టమొచ్చినా నేను, ప్రియాంక వస్తాం
‘‘నేను, మా చెల్లి ప్రియాంక ఇద్దరమూ తెలంగాణ ప్రజలకు దిల్లీలో సైనికులం. మీకు ఏ అవసరమొచ్చినా ఆదేశాలివ్వండి.. వెంటనే ఇక్కడికొస్తాం. తెలంగాణ ప్రజలతో మాకు కుటుంబ అనుబంధం ఉంది. -
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. మహిళల ఖాతాల్లో నగదు జమ
తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల ఖాతాల్లో నగదు జమ చేసే అంశంపై తొలి మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ స్పష్టంచేశారు. -
ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.12 వేల పింఛన్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని.. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు నెలకు రూ.12 వేల పింఛన్ ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. -
ఇక మాటల్లేవ్
అసెంబ్లీ ఎన్నికల హోరాహోరీ ప్రచారానికి తెరపడింది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారపర్వం ముగిసింది. గత నెలరోజులుగా అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో నిర్వహించిన బహిరంగ సభలు, రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లతో నెలకొన్న సందడి ముగియడంతో ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకుంది. -
ఖాజాగూడలో రూ.1.68 కోట్ల పట్టివేత
హైదరాబాద్ ఖాజాగూడలో పోలీసుల తనిఖీల్లో రూ.1.68 కోట్లు పట్టుబడ్డాయి. జడ్చర్ల కాంగ్రెస్ అభ్యర్థి అనిరుధ్‌రెడ్డి కోసం ఈ నగదు తరలిస్తున్నట్లు పట్టుబడ్డ ముగ్గురు వ్యక్తులు అంగీకరించారు. -
TS Elections: అభ్యర్థులు 2,290.. ఓటర్లు 3,26,02,799 ఎన్నికల విశేషాలివే..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (TS Elections) ప్రచారం ముగియడంతో పోలింగ్‌కు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. -
Telangana Elections: ఎన్నికలు ముగిసే వరకు మద్యం, కల్లు దుకాణాలు బంద్: సీపీ శాండిల్య
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగియడంతో హైదరాబాద్‌లో 144 సెక్షన్ అమల్లోకి వచ్చినట్లు సీపీ సందీప్ శాండిల్య వెల్లడించారు. -
KTR: తెలంగాణ ఇప్పుడెట్లుందో ఆలోచించండి.. ఆగం కాకండి: కేటీఆర్
తెలంగాణ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సిరిసిల్లలో మీడియాతో మాట్లాడారు. ప్రజలే కేంద్రంగా, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గత తొమ్మిదిన్నరేళ్ల ప్రయాణం కొత్త పంథాలో కొనసాగిందన్నారు. -
Vikasraj: సోషల్ మీడియాలోనూ ఎన్నికల ప్రచారం నిషిద్ధం: సీఈవో
ప్రచార గడువు ముగియడంతో సోషల్ మీడియాలోనూ ఎన్నికల ప్రచారం నిషిద్ధమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ (CEO Vikasraj) తెలిపారు. -
Telangana Elections: ప్రచారం పరిసమాప్తం.. పోలింగ్‌పైనే రాజకీయ పార్టీల గురి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు తుది అంకానికి చేరాయి. మంగళవారం సాయంత్రం 5గంటలకు మైకులు మూగబోయాయి. -
Karnataka govt: ‘ఉల్లంఘన కానే కాదు’.. పత్రికల్లో ప్రకటనలపై డీకే శివకుమార్
ఎన్నికళ వేళ తెలంగాణలోని పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం ఎన్నికల ప్రవర్తన నియామావళి కానేకాదని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఇదే విషయాన్ని ఈసీకి తెలియజేస్తామన్నారు. -
CM Kcr: గజ్వేల్ నా గౌరవాన్ని పెంచింది.. మరింత అభివృద్ధి చేస్తా: సీఎం కేసీఆర్
గత 24 సంవత్సరాలుగా తెలంగాణనే ఆశగా.. శ్వాసగా బతుకుతున్నానని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్ లో నిర్వహించిన సభలో సీఎం పాల్గొన్నారు. (Telangana Elections) -
Sonia gandhi: ‘మీరు నా మనసుకు దగ్గరగా ఉంటారు..’ తెలంగాణ ప్రజలకు సోనియా సందేశం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చారు. -
Telangana Elections: పోలింగ్ రోజు విధిగా సెలవు ప్రకటించాలి: వికాస్ రాజ్
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Telangana elections) రోజున రాష్ట్రంలోని ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు విధిగా సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ (Vikas raj) తెలిపారు.


తాజా వార్తలు (Latest News)
-
పదవీ విరమణ వయసులో.. సెక్యూరిటీ గార్డు డబుల్ పీజీ
-
యూపీలో అపహరణ.. హైదరాబాద్‌లో అత్యాచారం
-
ఏపీకి తుపాను ముప్పు.. డిసెంబరు తొలి వారంలో అతి భారీ వర్షాలు!
-
Cyber Attack: అమెరికా ఆస్పత్రులపై సైబర్ దాడి.. నిలిచిపోయిన వైద్య సేవలు
-
Rishab Shetty: అది చాలా బాధాకరం: ఓటీటీ సంస్థలపై రిషబ్ శెట్టి
-
Salaar: అందుకు వారికి సారీ.. ‘సలార్’ రూమర్స్‌పై ప్రశాంత్ నీల్ క్లారిటీ