icon icon icon
icon icon icon

CPI Narayana: ‘చావునోట్లో తల పెట్టానని అనడం బూటకం’

తెలంగాణ కోసం తాను చావునోట్లో తలపెట్టానని కేసీఆర్‌ పదేపదే చెప్పడం ఒట్టి బూటకమని, తాను ఆనాడు దీనికి ప్రత్యక్ష సాక్షినని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

Updated : 27 Nov 2023 07:24 IST

కొత్తగూడెం సింగరేణి, న్యూస్‌టుడే: తెలంగాణ కోసం తాను చావునోట్లో తలపెట్టానని కేసీఆర్‌ పదేపదే చెప్పడం ఒట్టి బూటకమని, తాను ఆనాడు దీనికి ప్రత్యక్ష సాక్షినని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆదివారం సీపీఐ, కాంగ్రెస్‌ ఉమ్మడి అభ్యర్థి కూనంనేని గెలుపుకోరుతూ.. ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన శేషగిరిభవన్‌లో ఏర్పాటైన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్‌ దీక్షప్రారంభించి విరమించేందుకు ప్రయత్నించాడని, ఉస్మానియా విద్యార్థులు ఆందోళనకు దిగడంతో అనివార్యంగా రూటుమార్చాడని ఆరోపించారు. అప్పటి నుంచి ఉస్మానియాకు వెళ్లే ధైర్యం చేయలేదన్నారు. ఉద్యమం నీరుగారొద్దని అప్పట్లో ఈ విషయాలను బయటకు రానీయలేదన్నారు. 1200 మంది యువత బలిదానాలతో మాత్రమే తెలంగాణ వచ్చిందని, కానీ అది తానొక్కడి సాధనే అంటూ ప్రజలను మోసగిస్తున్నాడని నారాయణ ఆరోపించారు. 30 సీట్లు వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని భాజపా, 40 సీట్లు వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని భారాస చెప్పడం వెనుక వీరి చీకటి కలయిక దాగుందన్నారు. రాష్ట్ర అధ్యక్షునిగా ఒక బీసీని తొలగించిన భాజపా రాష్ట్రానికి బీసీ సీఎంని చేస్తామని ప్రకటించడం హాస్యాస్పందమన్నారు. పోలింగ్‌కు ముందు ‘రైతుబంధు’కు ఎన్నికల కమిషన్‌ అనుమతినివ్వడం భారాస, భాజపాతో కుమ్మక్కైన విషయాన్ని తెలియజేస్తోందన్నారు. నిస్వార్థపరుడు, ప్రజాఉద్యమంలో నిరంతరం శ్రమిస్తూ అందరికీ అందుబాటులో ఉంటున్న తమ పార్టీ అభ్యర్థి కూనంనేని సాంబశివరావును గెలిపించాల్సిందిగా ఆయన కోరారు. అస్తమించే పార్టీ నుంచి పోటీ చేస్తున్న వనమాకు ఓటమి తప్పదన్నారు. జలగంకు ఓటు అడిగే అర్హత లేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img