రా.. రమ్మని.. ఆదర్శంగా ఉండమని!

వంద శాతం పోలింగ్‌ లక్ష్యంగా ఎన్నికల సంఘం ఓటర్లను ఆకర్షించేందుకు ఆదర్శ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా అధికారులు పోలింగ్‌ కేంద్రాల ముఖద్వారాలు, ఆవరణలను పూలతో అలంకరించారు.

Updated : 30 Nov 2023 07:09 IST

వంద శాతం పోలింగ్‌ లక్ష్యంగా ఎన్నికల సంఘం ఓటర్లను ఆకర్షించేందుకు ఆదర్శ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా అధికారులు పోలింగ్‌ కేంద్రాల ముఖద్వారాలు, ఆవరణలను పూలతో అలంకరించారు. పోలింగ్‌ కేంద్రాల్లోని గదులను కూడా ముస్తాబు చేశారు. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పోలింగ్‌ కేంద్రాన్ని ఇలా సుందరంగా తీర్చిదిద్దారు.

న్యూస్‌టుడే, గంగాధర


ఓట్ల పండగలో నాలుగు తరాల బంధం

‘‘మాది నాలుగు తరాల వారసత్వం. మేం తప్పకుండా ఓటేస్తాం’’ అంటూ తమ ఓటరు కార్డులను చూపుతున్న వీరంతా ఒకే కుటుంబ సభ్యులు. కొత్త ఓటరు మానస(18), ఆమె తల్లి కవిత(37), అమ్మమ్మ జనబాయి(57), అవ్వ రుక్కమ్మ(95)... వీరంతా హైదరాబాద్‌ శివారులోని రాజేంద్రనగర్‌ వాస్తవ్యులు. అక్టోబరు 30 వరకు ఓటరుగా చేరడానికి ఎన్నికల సంఘం అవకాశం ఇవ్వడంతో మానస పేరు నమోదు చేసుకున్నారు. తొలిసారి వచ్చిన ఓటుహక్కును తప్పకుండా వినియోగించుకుంటానని, అమ్మ, అమ్మమ్మ, అవ్వలనూ పోలింగ్‌ కేంద్రానికి తీసుకెళతానని ఆమె చెబుతున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌


భారత పౌరులమైన మేము

భారతదేశ పౌరులమైన మేము, ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మనదేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామనీ, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు