icon icon icon
icon icon icon

Bandi Sanjay: గతంలో ఎగ్జిట్‌ పోల్స్‌ తారుమారు: బండి సంజయ్‌

రాష్ట్రంలో గతంలో వివిధ ఎన్నికల సందర్భంగా వెల్లడైన ఎగ్జిట్‌ పోల్స్‌ తారుమారయ్యాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ కరీంనగర్‌ అసెంబ్లీ అభ్యర్థి, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

Updated : 01 Dec 2023 08:05 IST

తెలంగాణచౌక్‌ (కరీంనగర్‌), న్యూస్‌టుడే: రాష్ట్రంలో గతంలో వివిధ ఎన్నికల సందర్భంగా వెల్లడైన ఎగ్జిట్‌ పోల్స్‌ తారుమారయ్యాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ కరీంనగర్‌ అసెంబ్లీ అభ్యర్థి, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. తెలంగాణలో మెజార్టీ స్థానాలు గెలవబోతున్నామని, కరీంనగర్‌ అసెంబ్లీలోనూ భాజపా జెండా ఎగురబోతోందని ధీమా వ్యక్తం చేశారు. గురువారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెరాసలోని తెలంగాణ పేరును తీసేసి తన పార్టీ పేరును భారాసగా మార్చుకున్న కేసీఆర్‌ తెలంగాణ సెంటిమెంట్‌ అనడం ఏంటని ప్రశ్నించారు. నాగార్జునసాగర్‌ సమస్య ఇప్పుడే తెరమీదకు రావడంలో ఆంతర్యం ఏంటని అన్న ఆయన.. కేసీఆర్‌ తప్పుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img