icon icon icon
icon icon icon

Telangana Elections: తెలంగాణలో కాంగ్రెస్‌కే మొగ్గు!

హోరాహోరీగా అయిదు రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రెండు రాష్ట్రాలు హస్తానికి, రెండు రాష్ట్రాలు కమలానికి చేజిక్కే అవకాశం ఉందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి.

Updated : 01 Dec 2023 10:49 IST

ఛత్తీస్‌గఢ్‌లోనూ హస్తం పార్టీకే.. 
మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో భాజపాకే అవకాశం
మిజోరంలో జడ్‌పీఎం, ఎంఎన్‌ఎఫ్‌ నువ్వానేనా

5 రాష్ట్రాలపై ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు

దిల్లీ: హోరాహోరీగా అయిదు రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రెండు రాష్ట్రాలు హస్తానికి (Congress), రెండు రాష్ట్రాలు కమలానికి (BJP) చేజిక్కే అవకాశం ఉందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. తెలంగాణ (Telangana Elections 2023), ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌కి మొగ్గు ఉంటుందని లెక్కగట్టాయి. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో మాత్రం కమలం వికసిస్తుందన్నాయి. మిజోరంలో ‘జొరాం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌’ (జడ్‌పీఎం), ‘మిజో నేషనల్‌ ఫ్రంట్‌’ (ఎంఎన్‌ఎఫ్‌) మధ్య నువ్వా-నేనా అనే వాతావరణం నెలకొందని, ఆ తర్వాతి స్థానాల్లోనే కాంగ్రెస్‌, భాజపాలు నిలుస్తాయని అంచనాలు చెబుతున్నాయి. గురువారం సాయంత్రం ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే ఆయా సంస్థలు తమతమ అంచనాలను వెలువరించాయి. మధ్యప్రదేశ్‌లో భాజపా ఘన విజయం సాధించబోతోందని మూడు సంస్థలు చెప్పాయి. రాజస్థాన్‌లో భాజపాకే అవకాశమని ఎక్కువ సంస్థలు చెబితే మూడు మాత్రం కాంగ్రెస్‌కి ఛాన్స్‌ ఉందన్నాయి. సార్వత్రిక సమరానికి ముందు జరిగిన ఎన్నికలు కావడంతో వాస్తవ ఫలితాల కోసం అన్ని వర్గాలూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో భాజపా అధికారంలో ఉంది. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లు కాంగ్రెస్‌ పాలనలో ఉన్నాయి. తెలంగాణలో భారాస, మిజోరంలో ఎంఎన్‌ఎఫ్‌ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుత ఎన్నికల ఓట్ల లెక్కింపును అయిదు రాష్ట్రాల్లోనూ ఆదివారం చేపట్టనున్న విషయం తెలిసిందే. రాష్ట్రాలపై ఆయా సంస్థల అంచనాలు ఇలా ఉన్నాయి.


ఏ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారంటే..

దిల్లీ: శాసనసభ ఎన్నికలు జరిగిన అయిదు రాష్ట్రాల్లో ఏయే పార్టీలు గెలిచే అవకాశం ఉందనే విషయంలో వేర్వేరు సంస్థలు తమతమ అంచనాలను గురువారం సాయంత్రం వెల్లడించగా ఎన్డీటీవీ వాటిలో ప్రధానమైనవాటిని క్రోడీకరించి ‘పోల్‌ ఆఫ్‌ పోల్స్‌’ పేరుతో సారాంశాన్ని వెలువరించింది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img