icon icon icon
icon icon icon

Telangana Election Result: ఈసారి అత్యధికంగా అతివలు

రాష్ట్ర అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య పెరగనుంది. తొలిసారి రెండంకెల సంఖ్యలో మహిళలు అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేశారు. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి 34 మంది మహిళలు బరిలో నిలిచారు.

Updated : 04 Dec 2023 08:52 IST

10 మంది విజేతలు
తొలిసారి ఎన్నికైన వారు నలుగురు

 ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య పెరగనుంది. తొలిసారి రెండంకెల సంఖ్యలో మహిళలు అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం(telangana election results) ఎగరవేశారు. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి 34 మంది మహిళలు బరిలో నిలిచారు. అత్యధికంగా భాజపా 13 మంది అతివలకు టికెట్లు ఇచ్చింది. కాంగ్రెస్‌ 12 మందికి, భారాస 8 మందికి, జనసేన ఒకరికి టికెట్లు ఇచ్చాయి. అన్ని పార్టీలు, స్వతంత్రులు కలిపి మొత్తంగా 221 మంది మహిళలు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. వీరందరిలో 10 మంది గెలుపొందారు. 2014 నుంచి చూస్తే.. 10 మంది నారీమణులు అసెంబ్లీ గడప తొక్కనుండడం ఇదే మొదటిసారి. తాజాగా విజయం సాధించిన మహిళల్లో కాంగ్రెస్‌ నుంచి ఆరుగురు, భారాస అభ్యర్థులు నలుగురు ఉన్నారు. గెలిచిన 10 మందిలో నలుగురు తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినవారే. వీరిలో ముగ్గురు కాంగ్రెస్‌ నుంచి, మరొకరు భారాస నుంచి విజయం సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img