icon icon icon
icon icon icon

Janasena: డిపాజిట్‌ కోల్పోయిన జనసేన అభ్యర్థులు

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో పోటీచేసిన జనసేన అన్ని స్థానాల్లోనూ ఓటమి పాలైంది. ఆ పార్టీ అభ్యర్థులందరూ డిపాజిట్‌లు కోల్పోయారు.

Updated : 04 Dec 2023 07:55 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో పోటీచేసిన జనసేన అన్ని స్థానాల్లోనూ ఓటమి పాలైంది. ఆ పార్టీ అభ్యర్థులందరూ డిపాజిట్‌లు కోల్పోయారు. ఈ ఎన్నికల్లో జనసేన భాజపాతో కలిసి పోటీ చేసింది. పొత్తులో భాగంగా 11 స్థానాల్లో పోటీచేయాలని తొలుత భావించినా తర్వాత ఎనిమిది స్థానాలకు అంగీకరించింది. ఆ మేరకు కూకట్‌పల్లి, తాండూరు, కోదాడ, నాగర్‌కర్నూల్‌, ఖమ్మం, కొత్తగూడెం, వైరా (ఎస్టీ), అశ్వారావుపేట (ఎస్టీ) స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు పోటీచేశారు. అందులో నాలుగు స్థానాలు ఖమ్మం జిల్లాలోనే ఉండగా, మిగిలిన నాలుగు వేర్వేరు జిల్లాల్లో ఉన్నాయి. వారి తరఫున వివిధ నియోజకవర్గాలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌, కూకట్‌పల్లిలో భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా ప్రచారం చేశారు. కాగా అన్ని స్థానాల్లోనూ జనసేన అభ్యర్థుల ఓటమి పాలయ్యారు. కూకట్‌పల్లి అభ్యర్థి మూమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్‌కు మాత్రం 39,830 ఓట్లు రాగా, మిగిలిన అన్ని స్థానాల్లో ఐదువేల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img