icon icon icon
icon icon icon

BRS: భారాసకి కొరుకుడుపడని 6 స్థానాలివే..

భారాసకు ఇప్పటికీ రాష్ట్రంలో 6 స్థానాలు కొరుకుడు పడలేదు. 2001లో పార్టీ ఆవిర్భవించగా  అప్పటి నుంచి సాధారణ, ఉప ఎన్నికలు ఎన్నింటినో ఎదుర్కొంది.

Updated : 04 Dec 2023 07:14 IST

3 చోట్ల తొలిసారి విజయం

ఈనాడు, హైదరాబాద్‌: భారాసకు ఇప్పటికీ రాష్ట్రంలో 6 స్థానాలు కొరుకుడు పడలేదు. 2001లో పార్టీ ఆవిర్భవించగా  అప్పటి నుంచి సాధారణ, ఉప ఎన్నికలు ఎన్నింటినో ఎదుర్కొంది. గోషామహల్‌, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధిర, పినపాక, ఇల్లెందు, సత్తుపల్లి, అశ్వారావుపేటలలో పార్టీ పోటీ చేస్తూనే ఉన్నా ఇప్పటి వరకు గెలవలేదు.


తొలిసారి గెలిచినవి

మహేశ్వరం: రంగారెడ్డి జిల్లాలోని ఈ నియోజకవర్గంలో  2018లో కాంగ్రెస్‌ నుంచి గెలిచి భారాసలో చేరిన సబితారెడ్డికే  ప్రస్తుత ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వడంతో విజయం దక్కింది.

ఎల్బీనగర్‌ : 2014, 2018లలో ఓటమి ఎదురయింది. కాంగ్రెస్‌ నుంచి గెలిచి పార్టీలో చేరిన దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి ఈ ఎన్నికల్లో సీటు కేటాయించగా విజయం వరించింది.

భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఈ నియోజకవర్గంలో తొలిసారి విజయం వరించింది. పార్టీ అభ్యర్థి తెల్లం వెంకట్రావు విజయం సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img