హ్యాట్రిక్‌ విజేతలు 12 మంది

 రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 మంది అభ్యర్థులు హ్యాట్రిక్‌ కొట్టారు. వారిలో తొమ్మిది మంది హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి గెలిచిన వారే.

Updated : 04 Dec 2023 05:50 IST

ఈనాడు, హైదరాబాద్‌:  రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 మంది అభ్యర్థులు హ్యాట్రిక్‌ కొట్టారు. వారిలో తొమ్మిది మంది హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి గెలిచిన వారే. హైదరాబాద్‌ జిల్లా నుంచి రాజాసింగ్‌(గోషామహల్‌), తలసాని శ్రీనివాస్‌యాదవ్‌(సనత్‌నగర్‌), పద్మారావు(సికింద్రాబాద్‌), కౌసర్‌ మొహియుద్దీన్‌(కార్వాన్‌), జాఫర్‌ హుస్సేన్‌ మేరాజ్‌(నాంపల్లి నుంచి రెండు సార్లు, తాజాగా యాకుత్‌పురా), ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మాధవరం కృష్ణారావు(కూకట్‌పల్లి), అరికెపూడి గాంధీ(శేరిలింగంపల్లి), వివేకానంద(కుత్బుల్లాపూర్‌), కాలె యాదయ్య(చేవెళ్ల), ఉమ్మడి మెదక్‌ నుంచి గూడెం మహిపాల్‌రెడ్డి(పటానుచెరు) ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి జగదీశ్‌రెడ్డి(సూర్యాపేట), ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుంచి వేముల ప్రశాంత్‌రెడ్డి(బాల్కొండ) హ్యాట్రిక్‌ సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని