icon icon icon
icon icon icon

Telangana Elections: చిన్న పార్టీలు.. జయాపజయాలపై పెద్ద ప్రభావం

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రులు, ఇతర చిన్న పార్టీల నుంచి పోటీ చేసిన పలువురు ప్రధాన పార్టీల అభ్యర్థుల జయాపజయాలపై ప్రభావం చూపించారు.  

Updated : 04 Dec 2023 08:14 IST

ఈనాడు, హైదరాబాద్‌

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రులు, ఇతర చిన్న పార్టీల నుంచి పోటీ చేసిన పలువురు ప్రధాన పార్టీల అభ్యర్థుల జయాపజయాలపై ప్రభావం చూపించారు.  

  • కొత్తగూడెంలో జలగం వెంకట్రావు ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి బరిలోకి దిగి.. 53,789 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఇక్కడ సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు 26,547 ఓట్ల మెజార్టీ సాధించారు. భారాస సిట్టింగ్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మూడో స్థానానికి పరిమితమయ్యారు.
  • సూర్యాపేటలో భారాసను వీడి బీఎస్పీ అభ్యర్థిగా పోటీచేసిన వట్టె జానయ్య యాదవ్‌ 13,097 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. ఇక్కడ జగదీశ్‌రెడ్డి చేతిలో కాంగ్రెస్‌ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి 4,606 ఓట్ల తేడాతో ఓడిపోయారు. భాజపా అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర్‌రావు 40,407 ఓట్లు సాధించారు. త్రిముఖ పోటీ జరిగిన ఈ నియోజకవర్గంలో జానయ్య యాదవ్‌ చీల్చిన ఓట్లు ఏ పార్టీవోనని చర్చనీయాంశమైంది.
  • బీఎస్పీ నుంచి సిర్పూరులో పోటీ చేసిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌ 44,646 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఇక్కడ భాజపా అభ్యర్థి పాల్వాయి హరీశ్‌ భారాస సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్పపై 3,088 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
  • నల్గొండలో ఫార్వర్డ్‌బ్లాక్‌ నుంచి పోటీచేసిన పిల్లి రామరాజుయాదవ్‌ 27,096 ఓట్ల సాధించి మూడో స్థానంలో నిలిచారు.  
  • గద్వాలలో నడిగడ్డ పోరాట సమితికి చెందిన రంజిత్‌కుమార్‌ ఫార్వర్డ్‌బ్లాక్‌ తరఫున పోటీచేసి 13,454 ఓట్లు సాధించారు. ఇక్కడ భారాస సిట్టింగ్‌ బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి 7,036 ఓట్ల తేడాతో గెలుపొందారు.
  • పెద్దపల్లిలో బీఎస్పీ నుంచి పోటీ చేసిన దాసరి ఉష 10,315 ఓట్లు సాధించారు.
  • పటాన్‌చెరులో బీఎస్సీ అభ్యర్థిగా బరిలో ఉన్న నీలం మధు 59,225 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఇక్కడ భారాస సిట్టింగ్‌ గూడెం మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిపై 7,091 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.  
  • రామగుండంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ 4,048, ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌ రెబల్‌గా సంజీవరెడ్డి 1,946, జహీరాబాద్‌లో బీఎస్పీ నుంచి జంగం గోపీ 5,251 ఓట్లు సాధించారు.  
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img