icon icon icon
icon icon icon

Telangana Election Result: సవాల్‌ చేసి.. గుండు గీయించుకొని..

ఎన్నికల ఫలితాలపై ఛాలెంజ్‌ చేసిన ఓ కౌన్సిలర్‌ గుండు గీయించుకున్నారు. ఈ ఆసక్తికర సంఘటన మెదక్‌ జిల్లా రామాయంపేటలో సోమవారం చోటుచేసుకుంది.

Updated : 05 Dec 2023 09:35 IST

రామాయంపేటలో ఆసక్తికర ఘటన

రామాయంపేట, న్యూస్‌టుడే: ఎన్నికల ఫలితాలపై ఛాలెంజ్‌ చేసిన ఓ కౌన్సిలర్‌ గుండు గీయించుకున్నారు. ఈ ఆసక్తికర సంఘటన మెదక్‌ జిల్లా రామాయంపేటలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రామాయంపేట పురపాలిక పరిధిలో పార్టీల వారీగా వచ్చే ఓట్లపై కౌటింగ్‌కు ముందు భారాస నేతలు, కార్యకర్తల మధ్య చర్చ జరిగింది. భారాస కన్నా కాంగ్రెస్‌కే ఎక్కువ ఓట్లు వస్తాయని భారాసకు చెందిన 11వ వార్డు కౌన్సిలర్‌ గంగాధర్‌ తన అభిప్రాయం వెలిబుచ్చారు. దీంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో.. కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు రాకుంటే తాను గుండు గీయించుకుంటానని సవాల్‌ విసిరారు. ఫలితాల్లో కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. కానీ, భారాసకే ఎక్కువ ఓట్లు వచ్చాయంటూ ఆ పార్టీ నేతలు ఫలితాల రోజున తప్పుగా ప్రచారం చేశారు. కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లను గమనించని గంగాధర్‌.. భారాసకే అధిక ఓట్లు వచ్చాయన్న ప్రచారాన్ని నమ్మి గుండు గీయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ నాయకులు గంగాధర్‌ను కలిసి.. తమ పార్టీ(కాంగ్రెస్‌)కే ఎక్కువ ఓట్లు లభించాయని వివరించారు. తన సొంత పార్టీ(భారాస) నేతలే తనను తప్పుదారి పట్టించారని, అందుకు క్షమాపణ చెప్పాలని గంగాధర్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img