Congress: కొత్త ఎమ్మెల్యేలకు చిన్నారెడ్డి, నాగేశ్వర్‌ పాఠాలు

కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌ చిన్నారెడ్డి, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌లు శాసనసభా వ్యవహారాలపై పాఠాలు బోధించారు.

Updated : 06 Dec 2023 07:33 IST

ఈనాడు, హైదరాబాద్‌ : కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌ చిన్నారెడ్డి, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌లు శాసనసభా వ్యవహారాలపై పాఠాలు బోధించారు. మంగళవారం వారిద్దరూఎమ్మెల్యేలు బసచేసిన ఎల్లా హోటల్‌కు వచ్చి శాసనసభలో వ్యవహరించాల్సిన తీరు, రాజ్యాంగపరమైన అంశాలను వివరించారని తెలుస్తోంది. సమావేశం వివరాలను కాంగ్రెస్‌ పార్టీ మీడియాకు వెల్లడించలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేతగా ఉన్న మేడిపల్లి సత్యం మాట్లాడుతూ తమకు శాసనసభలో ఎలా వ్యవహరించాలనే అంశంతో పాటు, రాజ్యాంగపరమైన అనేక విషయాలను వివరించారని తెలిపారు. రేవంత్‌రెడ్డి సోమవారం ఉదయం నుంచి మంగళవారం సాయంత్రం వరకూ ఇదే హోటల్‌లో ఎమ్మెల్యేలతో కలసి ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని