Kadiyam Srihari: ఏడాదిలోగా మళ్లీ భారాస సర్కారే: ఎమ్మెల్యే కడియం సంచలన వ్యాఖ్యలు

పార్టీ కార్యకర్తలంతా ఒక్క ఏడాది ఓపిక పట్టాలని, ఏడాదిలోపే భారాస ప్రభుత్వం తిరిగి ఏర్పాటు అవుతుందని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Updated : 07 Dec 2023 06:48 IST

జనగామ టౌన్‌, న్యూస్‌టుడే: పార్టీ కార్యకర్తలంతా ఒక్క ఏడాది ఓపిక పట్టాలని, ఏడాదిలోపే భారాస ప్రభుత్వం తిరిగి ఏర్పాటు అవుతుందని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం జనగామ జిల్లా భారాస కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి సంతాప సభలో పాల్గొన్న కడియం శ్రీహరి పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ.. గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా గందరగోళంలో ఉన్నారన్నారు. భారాసకు 39 సీట్లు వచ్చాయని, మిత్రపక్షమైన ఎంఐఎం మద్దతు ఉందని, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్న భాజపాను కలుపుకొని, మరికొంత మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టమేమీ కాదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని