icon icon icon
icon icon icon

Telangana Assembly: ప్రొటెం స్పీకర్‌ ఎవరనేదానిపై ఆసక్తికర చర్చ

రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో తొలి సమావేశాలకు ప్రొటెం స్పీకర్‌గా ఎవరు వ్యవహరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

Updated : 08 Dec 2023 07:55 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో తొలి సమావేశాలకు ప్రొటెం స్పీకర్‌గా ఎవరు వ్యవహరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. కొత్తగా ఎన్నికైన సభ్యులతో మొదటగా ప్రమాణ స్వీకారం చేయించి స్పీకర్‌ను ఎన్నుకునేంత వరకు ప్రొటెం స్పీకర్‌ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. సాధారణంగా ఎక్కువసార్లు శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారు.

ప్రస్తుతం అత్యధికంగా ఎనిమిది సార్లు ఎన్నికైన శాసన సభ్యులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నారు. భారాసకు చెందిన ఇతర సభ్యుల్లో మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, దానం నాగేందర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆరుసార్లు ఎన్నికైన శాసనసభ్యులు. కాంగ్రెస్‌లో ఆరుసార్లు ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావులు ఇద్దరూ మంత్రులుగా నియమితులయ్యారు. ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ఆరుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. ఈ పరిస్థితుల్లో ఎవరు ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img