బైక్‌పై 330కి.మీ. ప్రయాణించి అసెంబ్లీకి వచ్చిన కొత్త ఎమ్మెల్యే

మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో విజయం సాధించిన కమలేశ్వర్‌ డొడియార్‌ అనే ఎమ్మెల్యే బైక్‌పై అసెంబ్లీకి వెళ్లారు.

Published : 08 Dec 2023 06:22 IST

మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో విజయం సాధించిన కమలేశ్వర్‌ డొడియార్‌ అనే ఎమ్మెల్యే బైక్‌పై అసెంబ్లీకి వెళ్లారు. ద్విచక్రవాహనం ముందు భాగంలో ఎమ్మెల్యే స్టిక్కర్‌ అతికించుకొని 330 కి.మీ. ప్రయాణించి అసెంబ్లీ అధికారులకు తన విజయ ధ్రువీకరణ పత్రాలను సమర్పించారు. స్వస్థలం రత్లాం జిల్లా సైలానా నుంచి భోపాల్‌కు ఆయన బైక్‌పై వచ్చారు. తనకు కారు కొనే స్తోమత లేదని, సొంత బైకు కూడా లేదని,  తన బంధువు ద్విచక్ర వాహనాన్ని తీసుకొని వచ్చినట్లు చెప్పారు. లా చదివిన కమలేశ్వర్‌.. భారతీయ ఆదివాసీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ పార్టీ తరఫున గెలిచిన ఏకైక అభ్యర్థి ఆయనే కావడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని