icon icon icon
icon icon icon

Telangana Elections: అన్నదమ్ములు.. ఒకరు కాంగ్రెస్‌, మరొకరు భాజపా!

వారిద్దరూ అన్నదమ్ములు. వేర్వేరు పార్టీల నుంచి ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో వేర్వేరు పార్టీల నుంచి పోటీ పడుతుండటం గమనార్హం. వారే సిలారపు దామోదర రాజనర్సింహ, సిలారపు రాంచందర్‌.

Updated : 21 Nov 2023 14:08 IST

వారిద్దరూ అన్నదమ్ములు. వేర్వేరు పార్టీల నుంచి ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో వేర్వేరు పార్టీల నుంచి పోటీ పడుతుండటం గమనార్హం. వారే సిలారపు దామోదర రాజనర్సింహ, సిలారపు రాంచందర్‌. వీరి తండ్రి సిలారపు రాజనరసింహ అందోలు ఎమ్మెల్యేగా 1967, 1972, 1978లలో మూడు సార్లు కాంగ్రెస్‌ తరఫున గెలించి హ్యాట్రిక్‌ సాధించారు. ఇక దామోదర 1989, 2004, 2009లో మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయాలను అందుకున్నారు. వైఎస్‌ హయాంలో ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. ఈ సారి కూడా కాంగ్రెస్‌ తరఫున ఇదే నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఇక ఆయన సోదరుడు రాంచందర్‌ జహీరాబాద్‌ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అన్నదమ్ములిద్దదూ వేర్వేరు పార్టీల్లో నుంచి పోటీ చేస్తుండటం గమనార్హం. మరి ఎవరిని విజయం వరించనుందో తెలియాలంటే డిసెంబరు 3 వరకు ఆగాల్సిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img