TS Elections: అభ్యర్థులు 2,290.. ఓటర్లు 3,26,02,799 ఎన్నికల విశేషాలివే..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (TS Elections) ప్రచారం ముగియడంతో పోలింగ్‌కు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

Updated : 28 Nov 2023 21:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (TS Elections) ప్రచారం ముగియడంతో పోలింగ్‌కు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్రంలో ఎక్కడికక్కడ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి.. అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం, ఆభరణాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ సారి ఎన్నికల్లో 80 ఏళ్లు పైబడిన వృద్ధులు దరఖాస్తు చేసుకుంటే ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం కల్పించారు. ఎన్నికల నిర్వహణకు బందోబస్తు ఖర్చు రూ.150 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు.

నియోజకవర్గాల వారీగా బరిలో ఉన్న అభ్యర్థులు వీరే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మరిన్ని విశేషాలు...

 • రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,26,02,799
 • పురుష ఓటర్లు .. 1,62,98,418, మహిళా ఓటర్లు..1,63,01,705 మంది.
 • ట్రాన్స్‌ జెండర్‌ ఓటర్ల సంఖ్య 2,676, రాష్ట్రంలో సర్వీసు ఓటర్లు 15,406, ప్రవాస ఓటర్లు 2,944
 • 18-19 ఏళ్ల వయస్సు ఓటర్ల సంఖ్య 9,99,667
 • రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల బరిలో 2,290 మంది అభ్యర్థులు. వారిలో మహిళలు 221 మంది, పురుషులు 2,068 మంది, ఒక ట్రాన్స్‌ జెండర్‌  ఉన్నారు.
 • ఈనెల 30న సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్.
 • అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్న 3.26 కోట్లకు పైగా ఓటర్లు.
 • ఓట్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్‌ కేంద్రాలు.
 • దివ్యాంగుల కోసం పోలింగ్‌ స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు.21,686 వీల్‌ఛైర్లు సిద్ధం చేసిన అధికారులు.
 • 80 ఏళ్లు పైబడిన వారికి ఉచిత రవాణా సదుపాయం.
 • బ్రెయిలీ లిపిలోనూ ఓటరు స్లిప్పులు, నమూనా బ్యాలెట్లు.
 • ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు 644 మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలు.
 • 120 పోలింగ్‌ కేంద్రాలను నిర్వహించనున్న దివ్యాంగులు.
 • 597 పోలింగ్‌ కేంద్రాలను నిర్వహించనున్న మహిళలు.
 • పోలింగ్‌ క్రతువులో పాల్గొననున్న 1,85,000 మంది సిబ్బంది. 22,000 మంది మైక్రో అబ్జర్వర్లు.
 • తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలైన 13 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ 
 • 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు.
 • అసెంబ్లీ ఎన్నికల బందోబస్తు కోసం కేంద్ర ఎన్నికల సంఘం 375 కంపెనీల సాయుధ కేంద్ర బలగాలను, రాష్ట్ర ప్రభుత్వం 50వేల మంది పోలీసులను కేటాయించింది.
 • గురువారం పోలింగ్‌, డిసెంబరు 3న ఎన్నికల ఫలితాలు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని