icon icon icon
icon icon icon

Bandi sanjay: ఎంపీ కాక ముందే ఐదుసార్లు జైలుకు వెళ్లా: బండి సంజయ్‌

హామీల అమలులో భాజపా ప్రభుత్వాలు ఎన్నడూ విఫలం కాలేదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అన్నారు. 

Updated : 21 Nov 2023 12:42 IST

కరీంనగర్‌: హామీల అమలులో భాజపా ప్రభుత్వాలు ఎన్నడూ విఫలం కాలేదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన పద్మశాలీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎంపీ కాక ముందే తాను పోరాటాలు చేస్తూ ఐదుసార్లు జైలుకు వెళ్లానని చెప్పారు. భాజపా కార్యకర్తపై దాడి జరిగితే అనేక సార్లు పోరాటం చేశానన్నారు. భారాస పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. ప్రజా పాలన రావాలంటే రాష్ట్రంలో భాజపానే అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img