icon icon icon
icon icon icon

Uttam Kumar Reddy: రైతుబంధు ఆపాలని నేను ఫిర్యాదు చేయలేదు: ఉత్తమ్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెబుతున్నట్లుగా రైతుబంధు ఆపాలని తానెక్కడా ఫిర్యాదు చేయలేదని టీపీసీసీ మాజీ చీఫ్‌, కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Updated : 18 Nov 2023 13:27 IST

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెబుతున్నట్లుగా రైతుబంధు ఆపాలని తానెక్కడా ఫిర్యాదు చేయలేదని టీపీసీసీ మాజీ చీఫ్‌, కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఓటమి భయంతో సీఎం కేసీఆర్‌ సహా భారాస నేతలు తమ పార్టీపై  దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్తమ్‌ మాట్లాడారు.

 రైతుబంధుతో పాటు ఇతర పథకాలను నామినేషన్‌ ప్రక్రియలోపు  ఇవ్వాలని  మాత్రమే తాము కోరినట్లు వివరించారు. 24గంటల కరెంట్‌ సహా ఇతర అంశాలపై కేసీఆర్‌ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని ఆయన కోరారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని అమలు చేసి తీరుతామని ఉత్తమ్‌ వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img