icon icon icon
icon icon icon

KCR: ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్‌ రాజీనామా.. ఆమోదించిన గవర్నర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్‌ రాజీనామా చేశారు. కేసీఆర్‌ రాజీనామాను గవర్నర్‌ ఆమోదించారు.

Updated : 03 Dec 2023 19:08 IST

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్‌ రాజీనామా చేశారు. ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారాస ఓటమి చవిచూసింది. ఈనేపథ్యంలో కేసీఆర్‌  తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారు. కేసీఆర్‌ రాజీనామాను గవర్నర్‌ ఆమోదించినట్టు రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్‌ సూచించినట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 64 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. సోమవారం కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img