icon icon icon
icon icon icon

Assembly Elections: మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో ప్రారంభమైన పోలింగ్‌

మధ్యప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. అక్కడ మొత్తం 230 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

Updated : 17 Nov 2023 09:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మధ్యప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. అక్కడ మొత్తం 230 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్‌ ఛింద్వాఢాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యప్రదేశ్‌లో ఎస్టీ రిజర్వుడు సీట్లు 47, ఎస్సీ రిజర్వుడు 35 ఉన్నాయి. 

మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో మిగిలిన 70 స్థానాలకు నేడు రెండో విడత పోలింగ్‌ కొనసాగుతోంది. అక్కడ ఈ నెల 7న 20 నియోజకవర్గాల్లో తొలివిడత పోలింగ్‌ జరిగింది. ఎస్‌పీ, బీఎస్‌పీ, ఆప్‌, జేడీయూ తదితర పార్టీలు బరిలో ఉన్నప్పటికీ.. రెండు రాష్ట్రాల్లో భాజపా, కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోటీ నెలకొని ఉంది. రెండో విడత జరుగుతున్న పోలింగ్‌లో పశ్చిమ రాయ్‌పుర్‌ స్థానంలో అత్యధికంగా 26 మంది పోటీలో ఉండగా.. డౌండీలోహారా స్థానంలో అత్యల్పంగా నలుగురు బరిలో ఉన్నారు. రెండోవిడత పోలింగు జరుగుతున్న 70 స్థానాల్లో క్రితం సారి కాంగ్రెస్‌ 50 చోట్ల గెలుపొందగా, భాజపా 13 సీట్లలో విజయం సాధించింది. జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌ నాలుగు, బీఎస్‌పీ రెండు స్థానాల్లో గెలుపొందాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img