icon icon icon
icon icon icon

PM Modi: బఘేల్‌ గెలవడం కష్టమే.. కాంగ్రెస్‌ కౌంట్‌డౌన్‌ మొదలైంది: ప్రధాని మోదీ

ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర సీఎం భూపేశ్‌ బఘేల్‌ పోటీ చేస్తున్న స్థానం నుంచి గెలవడం కష్టమని కొందరు మీడియా మిత్రులు, రాజకీయ విశ్లేషకులు తనతో చెప్పారని ప్రధాని మోదీ అన్నారు.

Updated : 13 Nov 2023 14:12 IST

రాయ్‌పుర్‌: ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) అభివృద్ధి గురించి తాను మాట్లాడటం కాంగ్రెస్‌ పార్టీకి నచ్చడంలేదని ప్రధాని మోదీ అన్నారు. సోమవారం ఛత్తీస్‌గఢ్‌లోని ముంగేలి జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో భాజపా అధికారంలోకి రాగానే అవినీతికి పాల్పడిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

‘‘ఛత్తీస్‌గఢ్‌ అభివృద్ధి గురించి నేను మాట్లాడితే కాంగ్రెస్‌ పార్టీకి నచ్చదు. రాష్ట్రంలో మొదటి దశ పోలింగ్ తర్వాత కాంగ్రెస్‌ అధికారం కోల్పోతుందనే విషయం స్పష్టమైంది. ఈ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌ ఆయన పోటీ చేస్తున్న స్థానంలో ఓడిపోతారని.. దిల్లీలో కొందరు మీడియా మిత్రులు, రాజకీయ విశ్లేషకులు నాతో చెప్పారు. కాంగ్రెస్‌కు మోదీ అంటే నచ్చదు. నాతోపాటు, నా సామాజిక వర్గంపై కూడా కాంగ్రెస్‌ విమర్శలు చేస్తోంది. కోర్టు సూచించినా.. క్షమాపణ చెప్పేందుకు అంగీకరించలేదు. ఓబీసీ వర్గాన్ని కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తుందనేందుకు ఇదే నిదర్శనం. అధికారం కోసం కాంగ్రెస్‌ ఎంతకైనా దిగజారుతుంది. రాష్ట్రంలో అవినీతికి పాల్పడిన వారిపై భాజపా ప్రభుత్వం వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు కౌంట్‌డౌన్‌ మొదలైంది’’ అని ప్రధాని మోదీ అన్నారు.

‘అద్భుతం.. మరపురాని వేడుక..!’ ప్రధాని మోదీ పంచుకున్న ‘దీపోత్సవ్‌’ ఫొటోలివే

ఛత్తీస్‌గఢ్‌లో 90 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మొదటి దశలో 20 అసెంబ్లీ స్థానాలకు నవంబరు 7న  పోలింగ్ జరిగింది. మిగిలిన 70 స్థానాలకు నవంబరు 17న రెండో దశ పోలింగ్‌ జరగనుంది. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. తొలి విడతలో సీఎం భూపేశ్‌ బఘేల్‌ పోటీ చేస్తున్న పాటన్‌ నియోజవర్గంలో పోలింగ్ ముగిసింది. ఇక్కడ భాజపా తరఫున బఘేల్‌ సోదరుని కుమారుడైన విజయ్‌ బఘేల్‌ (దుర్గ్‌ ఎంపీ) పోటీ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img