icon icon icon
icon icon icon

Nirmala sitharaman: నీళ్లు..నిధులు.. నియామకాలు ఎక్కడ?: నిర్మలా సీతారామన్‌

తెలంగాణ రాష్ట్రానికే ఎంతో గొప్పగా చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కూలిపోతున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ విమర్శించారు.

Published : 21 Nov 2023 15:57 IST

హైదరాబాద్‌: నీళ్లు, నిధులు, నియామకాలే ప్రధాన అంశంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. మిగులు బడ్జెట్‌తో ఏర్పాటైన తెలంగాణ ఇప్పుడు పూర్తిగా రుణాల మయమైంది. తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ నిర్వహణ సరిగా లేదని.. రాబోయే తరాల ప్రజలపై రుణభారం మోపుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్‌ మాట్లాడారు.

‘‘తెలంగాణ రాష్ట్రానికే ఎంతో గొప్పదిగా చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కూలిపోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన దళితబంధు పథకం ఎంతో గొప్పదని చెప్పారు. అధికారంలోకి రాగానే దళిత వ్యక్తిని సీఎం చేస్తామన్నారు. చేయలేదు. ఎస్సీ అయిన తాటికొండ రాజయ్యను డిప్యూటీ సీఎం చేసి ఎంతో గొప్పగా చెప్పారు. ఆ పదవి నుంచి ఆరు నెల్లలోనే ఆయనను తొలగించారు. రూ.3,300 కోట్లు బీసీల అభివృద్ధి కోసం వినియోగిస్తామని చెప్పి.. కేవలం రూ.77కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఆ నిధులన్నీ ఎందుకోసం వాడారో తెలియదు. తెలంగాణలో 11 వర్సిటీల పరిధిలో 2వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 72 శాతం అక్షరాస్యత ఉంటే తెలంగాణలో 66 శాతంగా ఉంది. జాతీయ సగటు కన్నా ఇది తక్కువ. తెలంగాణ ప్రభుత్వం విద్యకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అలాగే వదిలేశారు. నీళ్లు.. నిధులు.. నియామకాల పేరుతో ఏర్పాటైన రాష్ట్రంలో ఇవేవీ నెరవేరలేదు’’ అని నిర్మలా సీతారామన్‌ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img