icon icon icon
icon icon icon

Hyderabad: ఆక్సిజన్‌ సిలిండర్‌తో పోలింగ్‌ కేంద్రానికి.. అందరికీ వీళ్లు ఆదర్శం

తెలంగాణ ఎన్నికల (Telangana Elections 2023) పోలింగ్‌ కొనసాగుతోంది. యువత, మహిళలతో పాటు వృద్ధులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

Updated : 30 Nov 2023 12:14 IST

ఆక్సిజన్‌ సిలిండర్‌తో వచ్చిన శేషయ్య

హైదరాబాద్‌: తెలంగాణ ఎన్నికల (Telangana Elections 2023) పోలింగ్‌ కొనసాగుతోంది. యువత, మహిళలతో పాటు వృద్ధులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు సైతం పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. 

హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి చెందిన 75 ఏళ్ల శేషయ్య తీవ్రమైన లివర్‌ సిరోసిస్‌తో బాధపడుతున్నారు. ఆక్సిజన్ సిలిండర్‌తో ఆయన పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు. గచ్చిబౌలిలోని జీపీఆర్‌ఏ క్వార్టర్స్‌లోని పోలింగ్‌ కేంద్రంలో శేషయ్య తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు వేయడం పౌరుడిగా తన బాధ్యతని చెప్పారు. 1966 నుంచి తాను మిస్‌ అవ్వకుండా ఓటు వేస్తున్నానని తెలిపారు. మరోవైపు ముషీరాబాద్‌ గాంధీనగర్‌లోని ఎస్బీఐ కాలనీకి చెందిన ఆస్తమా రోగి లక్ష్మీ శ్యాంసుందర్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఘంటసాల గ్రౌండ్‌లోని 83వ నంబర్‌ పోలింగ్‌ కేంద్రంలో ఆమె ఓటు వేశారు. విద్యానగర్‌లోని హిందీ మహా విద్యాలయలో ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ఓటు హక్కు వినియోగించుకున్నారు. 99 ఏళ్ల వయసులో ఆయన పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. 

 

ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య

ఆస్తమా రోగి లక్ష్మీ శ్యాంసుందర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img