icon icon icon
icon icon icon

Rahul Gandhi: కాంగ్రెస్‌ గెలవగానే కార్మికులతో సీఎం సమావేశం: రాహుల్‌గాంధీ

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పారిశుద్ధ్య కార్మికులు సహా డెలివరీ బాయ్‌లు, డ్రైవర్ల సమస్యలను పరిష్కరిస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు.

Updated : 28 Nov 2023 12:15 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పారిశుద్ధ్య కార్మికులు సహా డెలివరీ బాయ్‌లు, డ్రైవర్ల సమస్యలను పరిష్కరిస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, గిగ్‌ వర్కర్లు, డెలివరీ బాయ్‌లు, ఆటో, క్యాబ్‌ డ్రైవర్లతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వారంతా తమ సమస్యలను రాహుల్‌ ముందు ఏకరువు పెట్టారు. 

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలవగానే కార్మికులతో సీఎం సమావేశమవుతారని రాహుల్‌గాంధీ వారికి హామీ ఇచ్చారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని.. తీవ్రంగా నష్టపోతున్నామని పారిశుద్ధ కార్మికులు, డెలివరీ బాయ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద బీమా కల్పించాలని డెలివరీ బాయ్‌లు ఆయనకు విజ్ఞప్తి చేశారు. పోలీసులు చలాన్లతో వేధిస్తున్నారని ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు రాహుల్‌ దృష్టికి తీసుకెళ్లారు. జీహెచ్ఎంసీలో కాంట్రాక్టు ఉద్యోగులను వేధిస్తున్నారని.. 11 గంటల పాటు పనిచేయించుకుంటున్నారని పారిశుద్ధ్య కార్మికులు ఆరోపించారు. సదుపాయాలు అడిగితే ఉద్యోగం మానేయమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రెండు పడకగదుల ఇళ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని రాహుల్‌గాంధీకి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img