Rahul Gandhi: తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని నిర్మిస్తాం: రాహుల్‌ గాంధీ

తెలంగాణలో రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వాన్ని నిర్మిస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.

Published : 06 Dec 2023 13:07 IST

దిల్లీ: తెలంగాణలో రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వాన్ని నిర్మిస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో గురువారం రేవంత్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సోనియా, రాహుల్‌, ప్రియాంకలను రేవంత్‌ ఆహ్వానించారు. అనంతరం రాహుల్‌ గాంధీ ఎక్స్‌(ట్విటర్‌)లో ఆ ఫొటోలను షేర్‌ చేశారు.

‘‘తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు. ఆయన నాయకత్వంలో ఏర్పడే కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తుంది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజా ప్రభుత్వాన్ని నిర్మిస్తాం’’ అని రాహుల్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని