Revanth Reddy: రేవంత్‌ ప్రమాణ స్వీకార సమయంలో మార్పు

తెలంగాణకు కాబోయే సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రమాణస్వీకార సమయంలో మార్పు జరిగింది.

Updated : 06 Dec 2023 12:33 IST

హైదరాబాద్‌: తెలంగాణకు కాబోయే సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రమాణస్వీకార సమయంలో మార్పు జరిగింది. గురువారం ఉదయం 10.28 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయాలని తొలుత నిర్ణయించగా.. తాజాగా ఆ సమయాన్ని కాస్త మార్చారు. గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ ముఖ్యనేతలు, కార్యకర్తలు తరలి రానున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని