Revanth Reddy: పెద్దమ్మ గుడి నుంచి ఎల్బీ స్టేడియానికి..

ప్రమాణ స్వీకారానికి ముందు జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మతల్లి గుడికి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) వెళ్లనున్నారు. కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకోనున్నారు.

Updated : 07 Dec 2023 11:03 IST

హైదరాబాద్‌: ప్రమాణ స్వీకారానికి ముందు జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మతల్లి గుడికి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) వెళ్లనున్నారు. కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియానికి రేవంత్‌ చేరుకోనున్నారు. మార్గమధ్యలో గన్‌పార్కు వద్ద అమరవీరుల స్తూపానికి ఆయన నివాళులర్పించనున్నారు.

మరోవైపు గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో ఉన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బస్సుల్లో ఎల్బీ స్టేడియానికి చేరుకోనున్నారు. ఇప్పటికే నాలుగు బస్సులను అధికారులు సిద్ధం చేశారు. మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.

రేవంత్‌ ప్రమాణస్వీకారం నేపథ్యంలో ఎల్బీ స్టేడియం వద్ద సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్‌ ముఖ్యనేతలు, కార్యకర్తలు తరలివస్తున్నారు. ఎల్బీ స్టేడియం వైపు వెళ్లే మార్గాల్లో భారీగా రేవంత్‌ ఫ్లెక్సీలను నేతలు, అభిమానులు ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని